twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR Pre release business: సినిమా హిస్టరీలోనే తొలిసారి.. ఊహకందని బిజినెస్.. చరిత్ర సృస్టిస్తున్న రాజమౌళి

    |

    ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR మూవీ విడుదలకు ముందే అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించిన వార్త మీడియా, సోషల్ మీడియా అనే తేడా లేకుండా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ సినిమా బిజినెస్‌ ఇండియాలోనే రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే...

    వాలు చూపుతో వయ్యారాల విందు.. సమంత హాట్ పిక్స్ వైరల్

    బాహుబలితో కలెక్షన్ల సునామీ

    బాహుబలితో కలెక్షన్ల సునామీ

    బాహుబలితో జక్కన్న ఇమేజ్ దేశ ఎల్లలు దాటింది. బాహుబలి సృష్టించిన కలెక్షన్ల సునామీతో ఆయనకు ఇంటర్నేషన్‌గా మార్కెట్ బలంగా ఏర్పడింది. సంచలన విజయం అందుకొన్న తర్వాత మన్యం వీరుల కథతో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో RRR మూవీకి తెర లేపారు. ఈ సినిమా 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ లాక్‌డౌన్ కారణంగా రిలీజ్ డేట్ వెనుకకు వెళ్లింది.

    హీరోల స్పెషల్ లుక్స్, టీజర్లతో భారీ హైప్

    హీరోల స్పెషల్ లుక్స్, టీజర్లతో భారీ హైప్

    ఇక బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో RRR సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. టీజర్లు, మోషన్ పోస్టర్లు, హీరోల స్పెషల్ లుక్ పోస్టర్లు సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఈ క్రమంలో RRR బిజినెస్‌కు మంచి డిమాండ్ ఏర్పడిందనే ట్రేడ్ వర్గాల సమాచారం.

    బికినీలో అందాల ఆరబోత.. జారా ఎస్మిన్ రచ్చ

    నైజాం, ఆంధ్రాలో బిజినెస్

    నైజాం, ఆంధ్రాలో బిజినెస్

    RRR ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో ఈ చిత్రం సుమారు రూ.75 కోట్లు పలికినట్టు తెలుస్తున్నది. ఇక ఆంధ్రాలో కూడా గట్టిగానే బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల హక్కులను రూ.165 కోట్లకు బేరం పెట్టినట్టు తెలుస్తున్నది. ఓవరాల్‌గా రూ.240 కోట్ల మేర జరిగినట్టు తెలిసింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

    కొంటె చూపుతో కాకపుట్టిస్తోంది.. మధురిమ ఫోటోలు వైరల్

    తమిళనాడు, కేరళ, కర్ణాటక హక్కులు

    తమిళనాడు, కేరళ, కర్ణాటక హక్కులు

    దక్షిణాదిలో తమిళనాడు థియేట్రికల్ హక్కులను రూ.48 కోట్లకు, కర్ణాటక హక్కులను రూ.45 కోట్లు, కేరళలో రూ.15 కోట్లకు అమ్మినట్టు తెలుస్తున్నది. ఓ ప్యాన్ ఇండియాకు సంబంధించి ఇదే అత్యుత్తమ రికార్డు అని చెప్పుకొంటున్నారు. దీంతో రాజమౌళి స్టామినా ఏమిటో అనే విషయం ఈ సినిమా బిజినెస్ అద్దం పట్టింది.

    బికినీ అందాలు.. ఔరా అనిపిస్తోన్న నైరా బెనర్జీ

    హిందీ థియేట్రికల్ రైట్స్

    హిందీ థియేట్రికల్ రైట్స్

    RRRకు సంబంధించి ఉత్తరాది రాష్ట్రాల హక్కులు కూడా రికార్డు ధరకు అమ్మినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా హిందీ రైట్స్ సుమారు రూ. 100 కోట్లకు, అలాగే ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను రూ. 77 కోట్ల మేర బిజినెస్ జరిగిందనే విషయం ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బాహుబలి సినిమాను మించి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం సెన్సేషనల్‌గా మారింది.

    పొట్టి బట్టల్లో రచ్చ.. ఆహానా కుమ్రా పిక్స్ వైరల్

    శాటిలైట్, డిజిటల్ హక్కులు ఎంతకు అంటే

    శాటిలైట్, డిజిటల్ హక్కులు ఎంతకు అంటే

    RRR ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండియాలో ఏ సినిమాకు జరగని విధంగా సుమారు 500 కోట్ల మేర ప్రచారం జరుగుతున్నది. అలానే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా రికార్డు స్థాయిలో భారీ ధర పలికినట్లు తెలుస్తున్నది. ఉత్తరాదిలో ఓ ప్రముఖ సంస్థ అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం సుమారు రూ.225 కోట్లు ఆఫర్ చేసిందని ట్రేడ్ టాక్. ఈ లెక్కల ఆధారంగా RRR ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు టచ్ చేసే అవకాశం ఉందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

    English summary
    SS Rajamouli's RRR movie is creating records in Indian film Industry. This movie is has done Rs.500 crores business in the India. Satellite business was abou Rs.225. This movie is set to release in 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X