RRR : కనీవినీ ఎరగనీ రీతిలో ఆల్ టైమ్ రికార్డులు.. తొక్కుకుంటూ పోయేలా సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్..
'బాహుబలి' లాంటి భారీ విజయం తరువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'RRR'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న విడుదల అవుతోంది. అయితే ప్రకటించిన నాటి నుంచే అనేక రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా అనేక రికార్డులు బద్దలుకొట్టిందని అంటున్నారు.

బాహుబలి టీం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్' కోసం పని చేసింది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మొదటి భారతీయ చిత్రంగా
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక డాల్బీ విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది.

రికార్డు స్థాయిలో బిజినెస్
ఈ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా విడుదలకు రోజుల మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. తెలంగాణ (నైజాం), ఏపీ, సీడెడ్‌లో ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ఈ సినిమా బిజినెస్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.

సీడెడ్ లో ఇదే భారీ రేటు
భారీ రేటుకి ఈ సినిమా రైట్స్ ని దక్కించుకుంటున్నారు బయ్యర్లు. ఈ సినిమా బాహుబలిని మించిన బడ్జెట్, అంతకుమించి స్టార్ ఎట్రాక్షన్ ఉండడంతో కొత్త రికార్డులు నమోదు కావడం లాంఛనం లాగే కనిపిస్తోంది. ఆంధ్రా ప్రాంత హక్కులు ఏకంగా రూ.95 కోట్లు పలికాయి. సీడెడ్ ప్రాంతంలో సినిమాకి భారీ ధర పలికినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. మొత్తం రూ.45 కోట్లకు పైగా సీడెడ్ లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా సీడెడ్ లో ఇదే భారీ రేటు అని అంటున్నారు.
Recommended Video


బిజినెస్లో టాప్ ప్లేస్
ఇక అందుతున్న సమాచారం మేరకు నైజాం (తెలంగాణ): రూ. 75 కోట్లు, సీడెడ్ (రాయలసీమ): రూ. 45 కోట్లు, ఉత్తరాంధ్ర: రూ. 23 కోట్లు, ఈస్ట్: రూ. 15 కోట్లు వెస్ట్: రూ. 13 కోట్లు, గుంటూరు: రూ. 17 కోట్లు, కృష్ణా: రూ. 14 కోట్లు నెల్లూరు: రూ. 9 కోట్లు తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ + ఏపీ : రూ. 211 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ బిజినెస్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 రూ. 122 కోట్లు బిజినెస్ చేసింది. ఆ తరువాత సాహో రూ. 121.6 కోట్లు చేసింది.


Click it and Unblock the Notifications











