twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళిని టచ్ చేయలేకపోయిన రజినీకాంత్.. RRR ముందు దర్బార్ డీలా!

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో గతంలో తమిళ చిత్ర పరిశ్రమ ఎక్కువగా డామినేట్ చేసేది. టెక్నికల్‌గా, కంటెంట్ పరంగా అన్ని సినీ రంగాలకంటే ముందుండేది. బాహుబలి తర్వాత ఒక్కసారిగా దక్షిణాదిలో తెలుగు సినీ పరిశ్రమ స్థాయి మారిపోయింది. కొద్ది రోజులుగా బిజినెస్ విషయంలో దక్షిణాదిలో టాప్ రేంజ్‌లో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నది. తాజాగా తమిళ పరిశ్రమపై టాలీవుడ్ మరోసారి పై చేయి సాధించింది. ఇంతకు ఏ విషయంలో అంటే..

    రికార్డు ధరకు RRR

    రికార్డు ధరకు RRR

    బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి దేశ సినీ పరిశ్రమపై పట్టు పెరిగింది. బాహుబలి కంటే ముందే తన సత్తాను జక్కన్న నిరూపించుకోవడంతో ఓవర్సీస్ బిజినెస్ విషయంలో బాహుబలి2 సినిమా థియేట్రికల్ రైట్స్‌ బిజినెస్ రూ.70 కోట్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత తాజాగా RRR సినిమా థియేట్రికల్ హక్కులను రూ.75 కోట్లకు అమ్మడం మరో రికార్డుగా నిలిచింది.

    దర్బార్ ఓవర్సీస్ బిజినెస్

    దర్బార్ ఓవర్సీస్ బిజినెస్

    దక్షిణాదిలో ప్రస్తుతం భారీ, క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అరుదైన కాంబినేషన్, అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌తో సినిమాలు క్రేజీగా మారాయి. అందులో దర్బార్ ఒకటి. ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ బాహుబలి, సాహో, RRR కంటే తక్కువ ఉండటం గమనార్హం. దర్భార్ ఓవర్సీస్ హక్కులు రూ.35 కోట్లకే అమ్ముడుపోయాయి.

    విజయ్ బిగిల్ ఓవర్సీస్ బిజినెస్

    విజయ్ బిగిల్ ఓవర్సీస్ బిజినెస్

    ఇక త్వరలో రిలీజ్ కానున్న బిగిల్ కూడా రూ.30 కోట్లకే ఓవర్సీస్ బిజినెస్ చేయడం జరిగింది. గతంలో పేట రూ.34.5 కోట్లు, కబాలి రూ.34 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే రజనీకాంత్‌కు సంబంధించిన గత చిత్రాలు పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపకపోవడమే హై రేంజ్‌లో బిజినెస్ కాలేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

    టాప్ 3 స్థానాల్లో టాలీవుడ్

    టాప్ 3 స్థానాల్లో టాలీవుడ్

    దక్షిణాది సినిమాల విషయానికి వస్తే.. ఓవర్సీస్ బిజినెస్ విషయంలో ఎప్పుడూ తమిళ చిత్రాలే పైచేయిని సాధించేవి. కానీ ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల క్రమంలో టాలీవుడ్ చిత్రాలు ఓవర్సీస్‌లో కాసులు పంటను పండిస్తున్నాయి. దాంతో తాజాగా ఓవర్సీస్‌లో టాప్ బిజినెస్ చేసిన చిత్రాల్లో మూడు తెలుగు చిత్రాలే కావడం విశేషం. RRR 75 కోట్లు, బాహుబలి 70 కోట్లు, సాహో 42 కోట్లతో టాప్ స్థానాలను ఆక్రమించాయి.

    English summary
    In Indian film industry, Usually Overseas Market Dominated by Tamil Industry. but Now Top 3 Biggest Business Movies From Telugu. RRR made Rs.75, Baahubali2 is Rs.70 croress Saaho Rs.42 crores business
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X