RRR vs Baahubali: బడ్జెట్ బిజినెస్ లో తేడా ఎంత.. నెంబర్ వన్ రికార్డ్ బ్లాస్ట్ అవుతుందా?
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ రేంజ్ నేషనల్ మార్కెట్ లెవెల్ కు వెళ్లి పోయిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ తోనే ఒక ప్రత్యేకమైన దారిని సెట్ చేసిన దర్శకుడు రాజమౌళి బాహుబలి రెండో భాగంతో మాత్రం ఆ దారిని మరింత విస్తీర్ణం చేశాడు అనే చెప్పాలి. టాలీవుడ్ సినిమాలు కూడా నేషనల్ లెవల్లో సత్తా చాటుతాయని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలలో పుష్ప కాస్త మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు RRR సినిమా అంతకుమించి అనేలా రికార్డులను క్రియేట్ చేస్తుంది అని చెబుతున్నారు. అసలు రెండు సినిమాల బడ్జెట్ వివరాలు అలాగే బిజినెస్ వివరాలు వచ్చే కలెక్షన్స్ లో ఎంత తేడా ఎంత ఉండవచ్చు అనే వివరాల్లోకి వెళితే..
Recommended Video


బాహుబలి 2తో న్యూ రికార్డ్
ఇక బాహుబలి ఫస్ట్ పార్ట్ మంచి విజయాన్ని అందుకోవడంతో సెకండ్ పార్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి అంతకుమించి అనేలా సెకండ్ పార్ట్ ను తెరకెక్కించాలి అనే రెండవ భాగం కోసం 250 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల కలెక్షన్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

RRR బడ్జెట్..
ఇక ప్రస్తుతం అయితే అందరి ఫోకస్ RRR సినిమా.కలెక్షన్స్ పైనే ఉంది. బాహుబలి కలెక్షన్స్ ను ఈ సినిమా బీట్ చేయగలదా అని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న బజ్ చూస్తుంటే ఈ సినిమా గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. RRR సినిమా కోసం దాదాపు 500 కోట్లకు పైగానే ఖర్చు అయినట్లుగా దర్శకుడు రాజమౌళి ఓపెన్ గా తెలియజేశాడు.

టోటల్ బిజినెస్ ఎంత?
ఇక RRR సినిమా బిజినెస్ ను బట్టి చూస్తే నిర్మాత ఆల్మోస్ట్ సేఫ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 వందల కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే కనీసం 850 కోట్లు దక్కించుకున్న కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయినట్లే లెక్క. ఇక చిత్ర యూనిట్ మాత్రం అంతకు మించి అనేలా సినిమా వసూళ్లను అందుకుంటుంది అని ఎంతో నమ్మకంతో ఉన్నారు.

మొదటి రోజు ఎంత రావచ్చు?
తప్పకుండా RRR సినిమా మొదటి రోజే ఇండియాలో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలుస్తుంది అని బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం చూస్తున్న అంచనాల ప్రకారం సినిమా మొదటిరోజు 150 కోట్ల వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే మొదట 100 కోట్లను దాటుతుంది అని చెప్పారు ఇక ఇప్పుడు సినిమా పై పెరుగుతున్న హైప్ చూస్తూ ఉంటే 200 కోట్లు అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా?
ఫైనల్ గా RRR సినిమా బాహుబలి ది కన్ క్లూజన్ కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి రెండో భాగం రెండు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లతో ముందుకు సాగింది. ఇక ఇప్పుడు RRR సినిమా అంతకంటే హై రేంజ్ లో విడుదల అవుతుంది కాబట్టి 2000 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందా లేదా అనేది అందరిలో కలుగుతున్న అతి పెద్ద సందేహం. మరి సినిమా అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











