Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
RRR Pre release bussiness: ఇండియాలోనే అతిపెద్ద బాక్సాఫీస్ టార్గెట్.. రాజమౌళి మైండ్ బ్లోయింగ్!
టాలీవుడ్ స్థాయిని ప్రపంచ సినిమాల ముందు నిలబెట్టిన అతికొద్ది మంది దర్శకుల్లో ఎస్ఎస్.రాజమౌళి ఒకరు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా పదానికి అసలైన అర్దాన్ని చెప్పారు. ఇక RRR సినిమాతో అంతకుమించి అనేలా రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ లెక్కలు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ కానున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ అన్ని కూడా క్లోజ్ అయినట్లు సమాచారం.
ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్
దర్శకధీరుడు రాజమౌళి నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోనే ఈ సినిమా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అని చెప్పవచ్చు. సినిమాను దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
బికినీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న శామా సికందెర్
నాన్ థియేట్రికల్ బిజినెస్
ఈ రోజుల్లో చిన్న సినిమాలకైనా పెద్ద సినిమాలకైనా నాన్ థియేట్రికల్ ద్వారా ముందే మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. సినిమా కంటెంట్ హైప్ క్రియేట్ చేయగలిగితే పెట్టిన బడ్జెట్ లో ముందే సగం డబ్బు వెనక్కి వచ్చినట్లే. ఇక RRR సినిమా కాంబినేషన్ తోనే హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ గా అన్ని భాషల్లో కలుపుకొని 225 నుంచి 250కోట్ల మధ్యలో వచ్చినట్లు తెలుస్తోంది.
నైనా గంగూలీ.. ప్రతి ఫ్రేమ్ లో హాట్ నెస్ డోస్ పెంచేస్తోంది
హిందీలో హక్కులు వాళ్ళకే
ఇక ఇటీవల తమిళ థియేట్రికల్ హక్కులను లైకా ప్రొడక్షన్ వారు దక్కించుకున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో ఏషియన్, వారాహి సంస్థల నుంచి రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పుడు నార్త్ మొత్తం రిలీజ్ హక్కులను పెన్ స్తూడియోస్ దక్కించుకుంది. హిందీ భాషకు సంబంధించిన డిజిటల్ హక్కులను కూడా వాళ్లే దక్కించుకున్నారు.
సంజీదా షేక్ కూల్ గ్లామరస్ లుక్స్
బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే
అంటే మొత్తంగా RRR సినిమా 750 నుంచి 800కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద 525కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి టాలీవుడ్ మార్కెట్ ను మరో లెవెల్ కు తీసుకువెళుతున్నట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెలిసిందే.