బ్లాక్ లో టిక్కెట్ 12,000...దటీజ్ సూపర్ స్టార్

By Srikanya

హైదరాబాద్ : టైం దగ్గరపడుతోంది. ఎక్కడ చూసినా టిక్కెట్ల హడావిడే. ఇక ఫ్యాన్స్ చేసే హంగామా గురించి అయితే చెప్పే అక్కర్లేదు. ఇదంతా లింగా గురించే...సూపర్ స్టార్ రజనీ భాక్సాఫీస్ వద్ద చేయబోయే హంగామా మామూలుగా లేదు. ఆయనకు ఉన్న క్రేజ్ కు ఒకటే నిదర్శనం...ఈ చిత్రం ఉదయం 7.35 టిక్కెట్..చెన్నై రిమీ థియోటర్ లో ఓ అభిమానిచేత 12,000 రూపాయలు కు కొనుక్కునేలే చేసింది. ఇది బ్లాక్ లో అమ్మిన టిక్కెట్ అని తెలుస్తోంది. ఆ అభిమాని పేరు Sargunaraj అని తెలుస్తోంది. బ్లాక్ లో కొనుక్కోవటం తప్పే అయినా అభిమానం ముందు అవేమీ కనపడటం లేదు.

Rs. 12,000 For Linga 1st Screening Ticket

https://www.facebook.com/TeluguFilmibeat

చిత్రం విషయానికి వస్తే..

'లింగ' కథ చాలా గొప్పదని సినీ నటుడు రజనీకాంత్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 'లింగ' చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'లింగ' చిత్ర సబ్జెక్ట్‌ చాలా పెద్దదని, రైలు పోరాట దృశ్యాలు, బ్రిడ్జ్‌ కట్టే దృశ్యాల్లో వందల మందిని పెట్టి సినిమా తీయడం గొప్ప విషయమన్నారు. ఈ ఫలితం మొత్తం దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌లకు దక్కుతుందన్నారు.

సాబుశిరిల్‌, రత్నవేల్‌, ఏఆర్‌ రెహమాన్‌, అనుష్క, సోనాక్షి సిన్హా లాంటి బిజీ తారలను పెట్టుకుని ఆర్నెల్లో సినిమా తీయడం నిజంగా చాలా కష్టమన్నారు. ఈ చిత్ర కథనం తమదేనంటూ నలుగురు కేసు పెట్టారని అయితే ఇది రచయిత పొన్నుకుమారన్‌దే అన్నారు. కథనం అందంగా ఉంటుందన్నారు.

కొన్ని పోరాట దృశ్యాలు తాను సొంతంగా చేయలేదని, కానీ హీరోయిన్లతో పాటలన్నీ చేశానని చమత్కరించారు. చాలా కష్టపడి రజనీకాంత్‌ను అందంగా చూపించానని మేకప్‌మేన్‌ అన్నారంటూ చిరునవ్వులు చిందించారు. ఈ సందర్భంగా 'బాహుబలి' చిత్రం గురించి మాట్లాడుతూ... అది చాలా గొప్ప సినిమా అని, దర్శకుడు రాజమౌళి నిజంగా ఓ గొప్ప దర్శకుడని కితాబిచ్చారు.

తన తర్వాత చిత్రం ఏమిటని నిర్మాత అల్లు అరవింద్‌ అడిగారని అయితే మంచి కథ, కథనం దొరికిన వెంటనే తాను చేస్తానని చెప్పానన్నారు. అదే విధంగా చిరంజీవితో త్వరగా ఓ సినిమా చేయాలని అరవింద్‌కు సూచించినట్లు రజనీకాంత్‌ తెలిపారు.

సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X