»   » 3 రోజుల్లో రూ. 450 కోట్లు: బాహుబలి-2 కలెక్షన్ల రహస్యం ఇదేనా?

3 రోజుల్లో రూ. 450 కోట్లు: బాహుబలి-2 కలెక్షన్ల రహస్యం ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాగ్నమ్ ఓప్ ఫిల్మ్ బాహుబలి-ది కంక్లూజన్ బాక్సాఫీసు వద్ద ఇండియన్ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు కొల్లకొడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ట్రేడ్ పండితుల ఊహకు అందని విధంగా వందల కోట్లు వసూలు చేస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్ల వసూలు చేసినట్లు సమాచారం. రూ. 1000 కోట్ల మార్కును అందుకోబోతున్న తొలి ఇండియన్ మూవీ ఇదే అని అంతా అంటున్నారు.


ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలంలో రిలీజ్ చేసారు. అన్నికంటే ఎక్కువగా తెలుగులోనే ఎక్కువ వసూళ్లు సాధిస్తోంది. సినిమాకు ఇంత భారీ ఎత్తున కలెక్షన్లు రావడానికి కారణం సినిమా ప్రత్యేక పరిస్థితుల్లో రిలీజైందని.... అదనపు షోలు, టికెట్ల రేటు పెంచడం కూడా బాగా కలిసొచ్చిందని అంటున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం థియేటర్లు

తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం థియేటర్లు

తెలుగు రాష్ట్రాల్లో 90శాతం థియేటర్లలో బాహుబలి-2 సినిమా రిలీజైంది. ఇలాంటి అవకాశం లభించడం చాలా అరుదు. ఇంత డిమాండ్ ఉన్న సినిమా గతంలో ఎప్పుడూ రాలేదు. డిమాండ్ కు తగిన విధంగానే థియేటర్లు కావాల్సినన్ని దొరికాయి.


అదనపు షోలు

అదనపు షోలు

తెలుగు సినీ పరిశ్రమ గర్వపడేలా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీసారు. అందుకే అటు ఏపీ ప్రభుత్వంతో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. ఏపీలో ప్రతి రోజూ 6 షోలు ప్రదర్శింపబడుతుండగా....తెలంగాణలో రోజూ 5 షోలు ప్రదర్శిస్తున్నారు.


అధిక ధరలు

అధిక ధరలు

తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి లభించింది. దీంతో సాధారణం కంటే అధిక ధరలకు టికెట్స్ అమ్ముతున్నారు. దీని కారణంగా 30 శాతం వరకు అధిక రాబడి వస్తోంది.


మల్టీప్లెక్సుల్లో...

మల్టీప్లెక్సుల్లో...

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మల్టీప్లెక్సుల్లో వారం పాటు కేవలం బాహుబలి-2 సినిమా తప్ప మరే సినిమా ప్రదర్శితం కావడం లేదు. 4 నుండి 5 స్క్రీన్లు ఉన్న మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రోజు 20 నుండి 25 షోలు రన్ చేస్తున్నారు.


అంతా బడా బాబులే...

అంతా బడా బాబులే...

ఇక సినిమాను తెలుగు, హిందీ, తమిళనం, కన్నడ, మళయాల రైట్స్ దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయా ఇండస్ట్రీల్లో అగ్రస్థానంలో ఉన్నవారే కావడం విశేషం. హిందీలో కరణ్ జోహార్ లాంటి పెద్ద నిర్మాత సినిమాను రిలీజ్ చేయడం కూడా బాగా కలిసొచ్చింది.


ధర ఎక్కువైనా ఎగబడుతున్న ప్రేక్షకులు

ధర ఎక్కువైనా ఎగబడుతున్న ప్రేక్షకులు

టికెట్ ధర ఎక్కువైన ప్రేక్షకులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సినిమాలో కావాల్సినం విషయం ఉంది కాబట్టే సినిమాకు ఇంత క్రేజ్ ఉందని తెలుస్తోంది. సినిమా స్టోరీ, విజువల్ ఎఫెక్ట్స్, క్యారెక్టర్స్, స్క్రీన్ ప్లే పరంగా సినిమా ఎంతో అద్భుతంగా ఉండటమే ఇందుకు కారణం.


మీడియా సహకారం

మీడియా సహకారం

ఇలాంటి పెద్ద సినిమాకు మీడియా సహకారం కూడా కావాల్సినంత లభించింది. సినిమాపై హైప్ పెరగడానికి మీడియా కూడా తన వంతు సహకారం అందించింది.English summary
Rs. 450 cr in 3 days: Magnum opus Baahubali -The Conclusion's storming Box Office collections raised many eyeballs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu