twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

    రజనీ 2.0 చిత్రం రూ. 360 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇందులో రూ. 40 కోట్లు కేవలం ప్రమోషన్ల కోసమే. నవంబర్ 20న జరిగే ఫస్ట్ లుక్ ఈవెంటుకోసం ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేస్తున్నారట.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సౌత్‌లో నాలుగు సినీ పరిశ్రమలున్నాయి. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ. ఈ నాలుగు పరిశ్రమల్లో పోటా పోటీ వాతావరణం ఉండేది మాత్రం తెలుగు, తమిళ పరిశ్రమల మధ్యే. బాహుబలి రాక ముందు తమిళ సినిమాలదే పైచేయి.

    అటు బడ్జెట్ పరంగా చూసుకున్నా, వసూళ్ల పరంగా చూసుకున్నా తమిళ సినిమాలదే పైచేయి ఉండేది. మనకంటే ముందే తమిళ హీరోలు రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. అయితే బాహుబలి వచ్చి అన్ని సౌతిండియా రికార్డులను తుడిచేసింది. తెలుగు సినీ పరిశ్రమను అగ్రస్థానంలో నిలిపింది.

    బాహుబలిని పడగొట్టాలని కసి...?

    బాహుబలిని పడగొట్టాలని కసి...?

    ఇపుడు బాహుబలి సినిమా రికార్డులను పడగొట్టాలని తమిళ సినీ వర్గాలు కొంతకాలంగా తెగ ప్రయత్నిస్తున్నాయి. ఆ మధ్య విజయ్ ‘పులి' అనే సినిమా తీసినా అది బాహుబలిని బీట్ చేయలేక పోయింది. తర్వాత ‘ఐ' సినిమా వచ్చింది. అదీ చతికిల పడింది. ఇపుడు బాహుబలిని పడగొట్టడమే లక్ష్యంగా మరో మూవీ సిద్ధం అవుతోంది.

    రజనీ 2.0

    రజనీ 2.0

    ఒకప్పుడు సౌత్‌లో పెద్ద సినిమాలు, భారీ వసూళ్లు సాధించే సినిమాలు తీసే దర్శకుడు ఎవరంటే శంకర్ పేరు మాత్రమే వినిపించేది. అయితే బాహుబలి తర్వాత శంకర్ పేరు చిన్నబోయింది. రాజమౌళి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా శంకర్ బాహుబలి సినిమాను పడగొట్టడమే లక్ష్యంగా.... రజనీకాంత్ హీరోగా 2.0 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

    బాహుబలిని మించిన బడ్జెట్

    బాహుబలిని మించిన బడ్జెట్

    బాహుబలి మూవీని మించిన బడ్జెట్‌తో 2.0 మూవీ తెరకెక్కుతోంది. దక్షిణాదిలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా ఈ చిత్రానికి ఏకంగా రూ. 360 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అపీషియల్ గా ప్రకటించింది కూడా.

    పబ్లిసిటీ కోసమే రూ. 40 కోట్లు ఖర్చు

    పబ్లిసిటీ కోసమే రూ. 40 కోట్లు ఖర్చు

    అంత ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నపుడు.... వసూళ్లు తిరిగి రాబట్టుకునే ఉపాయాలు కూడా చాలా‌నే ఉంటాయి. సినిమాకు ఎంత ఎక్కువ పబ్లిసిటీ చేస్తే అంతగా జనాల్లోకి వెలుతుంది, వారిలో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. అందుకే సినిమా బడ్జెట్లో రూ. 40 కోట్లు పబ్లిసిటీ కోసమే ఖర్చు చేస్తున్నారు.

    బాహుబలిని పడగొట్టాలంటే తప్పదు మరి

    బాహుబలిని పడగొట్టాలంటే తప్పదు మరి

    బాహుబలి లాంటి సినిమాను మించిన పెద్ద హిట్టు కావాలంటే.... భారీ బడ్జెట్, ప్రేక్షకుల ఊహకందని కాన్సెప్టుతో పాటు పబ్లిసిటీ భారీగా చయడం కూడా అవసరమే. అందుకోసమే ఈ సినిమా బడ్జెట్లో భారీ మొత్తాన్ని సినిమా ప్రమోషన్ల కోసం వాడుతున్నారు.

    అక్షయ్ కుమార్ ను తీసుకున్నది అందుకే

    అక్షయ్ కుమార్ ను తీసుకున్నది అందుకే

    బాలీవుడ్ మార్కెట్లో సత్తా చాటాలంటే... బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్లే కావాలి. అందుకోసమే దర్శకుడు శంకర్ అక్షయ్ కుమార్ ను విలన్ పాత్రకు ఒప్పించాడు. అక్షయ్ కుమార్ ద్వారా సినిమా ప్రమోషన్లు భారీగా నిర్వహించబోతున్నారు.

    కరణ్ జోహార్‌ను తన వైపుకు తిప్పుకున్నారు

    కరణ్ జోహార్‌ను తన వైపుకు తిప్పుకున్నారు

    ఇక బాలీవుడ్లో బాక్సాఫీసు వద్ద హిట్టు కొట్టే టెక్నిక్స్ బాగా తెలిసిన దర్శక నిర్మాత కరణ్ జోహార్. బాహుబలి సినిమా విషయంలో కరణ్ జోహార్ స్వయంగా రంగంలోకి దిగడం వల్లనే అక్కడ భారీ విజయం సాధించి, కోట్ల వర్షం కురిపించింది. ఆ కారణంగానే కరణ్ జోహార్ తమ వైపుకు తిప్పుకుని 2.0 సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు.

    ఫస్ట్ లుక్ లాచింగ్ కార్యక్రమం కోసం రూ. 6 కోట్ల ఖర్చు

    ఫస్ట్ లుక్ లాచింగ్ కార్యక్రమం కోసం రూ. 6 కోట్ల ఖర్చు

    ఈ చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ నవంబర్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంటు కోసం రూ. 6 కోట్లు ఖర్చు చేస్తున్నారట.

    రజనీకాంత్ ‘రోబో 2.0’ ప్రీ లుక్...ఇదే

    రజనీకాంత్ ‘రోబో 2.0’ ప్రీ లుక్...ఇదే

    రజనీకాంత్ ‘రోబో 2.0' ప్రీ లుక్ ఇదే.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    తెలుగు తమిళ ఇండస్ట్రీల మధ్య ఈ పోటీ మంచిదేనా!? రాజమౌళీ V/S శంకర్ ఈ పోటీ ఎక్కడికి తీసుకెళ్తోంది?

    తెలుగు తమిళ ఇండస్ట్రీల మధ్య ఈ పోటీ మంచిదేనా!? రాజమౌళీ V/S శంకర్ ఈ పోటీ ఎక్కడికి తీసుకెళ్తోంది?

    తెలుగు తమిళ ఇండస్ట్రీల మధ్య ఈ పోటీ మంచిదేనా!? రాజమౌళీ V/S శంకర్ ఈ పోటీ ఎక్కడికి తీసుకెళ్తోంది?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Rajinikanth-Akshay Kumar's first look event will be held on 20 November. According to reports on a leading daily, this is turning out to be one of the most expensive first look events at Rs 6 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X