పంజా ఆడియో లైవ్ టెలికాస్ట్ రైట్స్ అంతా?
పవన్ కళ్యాణ్ పంజా ప్రతీ విషయంలోనూ రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం ఆడియో పంక్షన్ ఈ రోజు సాయింత్రం జరగనుంది. ఈ టెలీకాస్ట్ రైట్స్ ని మా టీవీ, మహా టీవీ వారు తీసుకున్నారు.వారు తలో పది లక్షలు ఈ రైట్స్ కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఛానెల్స్ ఈ పంక్షన్ ని లైవ్ ఇస్తాయి. ఈ పంక్షన్ గచ్చిబౌళి స్టేడియంలో జరగనుంది. ఇక ఆడియో పంక్షన్ టెలి కాస్ట్ రేటు ఈ రేంజిలో పలకటం ఇదే మొదటి సారి అంటున్నారు. సినిమా విషయానికి వస్తే ... కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్ కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది.
ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్ శంకర్ రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.


Click it and Unblock the Notifications











