Rudrudu day 1 collections రుద్రుడు మూవీకి షాకింగ్‌గా బిజినెస్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ నటించిన తాజా చిత్రం రుద్రుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో రూపొందిన రుద్రన్ సినిమాకు తెలుగు డబ్బింగ్ చిత్రంగా ఏప్రిల్ 14వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రిలీజైంది. ఈ సినిమా అన్ని వర్గాల నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. సగటు ప్రేక్షకుడు, సినీ విమర్శకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో రుద్రుడు చిత్రం తొలి రోజు ఎలాంటి కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే...
రుద్రుడు సినిమాకు భారీ బిజినెస్ : గతంలో రాఘవ లారెన్స్ రూపొందించిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించాయి. దాంతో రుద్రుడు మూవీకి భారీగానే బిజినెస్ జరిగింది. తెలుగులో బీ కేటగిరి హీరోలకు కూడా జరగని క్రేజీ బిజినెస్ ఈ సినిమాకు రావడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. దాంతో ఈ సినిమాకు ట్రేడ్ సర్కిల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

నైజాం, ఏపీలో బిజినెస్ : రుద్రుడు సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో 2.5 కోట్లు, సీడెడ్‌లో 1 కోటి రూపాయలు, ఆంధ్రా ఏరియాలోని అన్ని జిల్లాలో 3.5 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా 7 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. బ్రేక్ ఈవెన్ కనీసం 7.5 కోట్లుగా నిర్ణయించారు.
రుద్రుడు ఆక్యుపెన్సీ : రుద్రన్ సినిమా తమిళనాడులో ఓ మోస్తారు ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తమిళనాడులో ఈ సినిమా 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగులో యావరేజ్‌గా ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తంగా 15 శాతం ఆక్యుపెన్సీని రిజిస్టర్ చేసింది. కర్ణాటకలో తెలుగు, తమిళ వెర్షన్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

తొలి రోజు కలెక్షన్ల అంచనా : తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ చిత్రం నైజాం, ఆంధ్రాలో కలిపి మొత్తంగా 1 కోటి రూపాయల షేర్, 1.5 కోట్ల గ్రాస్ సాధించే అవకాశం ఉంది. ఇక తమిళంలో 2 కోట్ల షేర్, 3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది. దాంతో ఈ సినిమా ఇండియాలో మొత్తంగా 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు : ఇక ప్రపంచవ్యాప్తంగా రుద్రన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓవర్సీస్ వసూళ్లను కలిపితే మరో 1 కోటి రూపాయలు రావొచ్చు అని అంచనా వేశారు. దాంతో ఈ సినిమా మొత్తంగా 5.5 కోట్ల గ్రాస్ వసూళ్లను, సుమారు 3.5 కోట్ల షేర్ వసూలు చేయవచ్చని అంచాన వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











