Rudrudu day 2 collections పేలవంగా రుద్రుడు కలెక్షన్లు.. రాఘవ లారెన్స్ మూవీ 2వ రోజు ఎంత వసూలు చేసిందంటే?
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ రాఘవ నటించిన రుద్రుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పక్కా మాస్ కమర్షియల్‌గా రూపొందింది.
అయితే ఈ సినిమా రొటీన్ కథాంశంతో రూపొందండంతో సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ కూడగట్టుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లో ప్రదర్శిస్తున్న ఈ చిత్రం గత రెండు రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే...

రుద్రుడు బడ్జెట్.. ప్రీ రిలీజ్ బిజినెస్: రుద్రుడు సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. అన్ని ఖర్చులతో కలిపి ఈ సినిమా 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. తమిళంలో 11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్, తెలుగులో 6.8 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళంలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 12 కోట్ల షేర్, 25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగులో కనీసం ఈ చిత్రం 7 కోట్ల షేర్, 14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.
రుద్రుడు స్క్రీన్ కౌంట్: రాఘవ లారెన్స్ నటించిన గత సినిమాలు భారీ విజయాలు సాధించడంతో రుద్రన్ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను తమిళనాడులో 400 స్క్రీన్లు, తెలుగులో 200 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే రాఘవ లారెన్స్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.

రుద్రన్ తొలి రోజు కలెక్షన్లు: రుద్రన్ (తెలుగులో రుద్రుడు) సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 2.65 కోట్ల గ్రాస్, ఆంధ్ర ప్రదేశ్‌లో 1.5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 45 లక్షల గ్రాస్, కర్ణాటకలో 35 లక్షల గ్రాస్, కేరళ, ఇతర రాష్ట్రాల్లో 5 లక్షల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 5 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.
రెండో రోజు రుద్రుడు కలెక్షన్లు: రుద్రుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 15 లక్షలు, సీడెడ్‌లో 10 లక్షలు, ఉత్తరాంధ్రలో 9 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 6 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షలు, గుంటూరులో 4 లక్షలు, కృష్ణా జిల్లాలో 4 లక్షలు, నెల్లూరు జిల్లాలో 2 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 53 లక్షల షేర్, 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు వసూళ్లు: ఇక రుద్రుడు సినిమా రెండో రోజు తమిళనాడులో నిలకడగా కలెక్షన్లను సాధించింది. రెండో రోజు ఈ చిత్రం 2.1 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా గత రెండు రోజుల్లో మొత్తంగా 4.75 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో ఈ సినిమా నిలకడగా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం.
రుద్రుడు లాభాల్లోకి రావాలంటే?: ప్రపంచవ్యాప్తంగా రుద్రుడు సినిమా గత రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం మొత్తం 9 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. కర్ణాటకలో 45 లక్షలు, ఓవర్సీస్‌లో 55 లక్షలు నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. ఇంకా ఈ సినిమా 16 కోట్లు వసూలు చేస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











