హిందీ 'రుద్రమదేవి' రేపటినుంచే

By Srikanya

హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసింది ‘రుద్రమదేవి' టీమ్ . ఇప్పుడు హిందీ వెర్షన్ సైతం విడుదల అవుతోంది. రేపు హైదరాబాద్ లో హిందీ వెర్షన్ కు సంభందించిన విషయాన్ని అనుష్క సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

Catch the #HistoricHitRudramadevi Hindi now at Hyderabad

Posted by Anushka Shetty on 10 November 2015

ఈ చిత్రం టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం అదరొకొట్టాయి. ఈ నాలుగు రోజులు కలెక్షన్స్ ఆంధ్రా,తెలంగాణాలలో బాగున్నాయి. ఇక ఇప్పుడు తమిళంలోనూ ఈ చిత్రం విడుదల అయ్యి...అక్కడ ప్రేక్షకులను అలరించింది.

 Rudrama Devi Hindi version from tomorrow

చిత్రం కథేమిటంటే...

రుద్రమదేవి(అనుష్క) పుట్టేటప్పడికి కాకతీయ సామ్రాజ్య పరిస్దితులు బాగోలేవు... ఓ ప్రక్క దాయాదుల నుంచి, మరో ప్రక్క శత్రువుల నుంచి రాజ్యానికి ముప్పు ఉంది. మగపిల్లవాడు పుడితే తమ వారసుడుగా ఏలుతాడు అనుకుంటే పుట్టింది ఆడపిల్ల అని తెలిసి రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు) నిరాశపడతాడు. వారసుడు లేడు అని తెలిస్తే వెంటనే వారంతా దండెత్తే అవకాసం ఉందని ఏం చేయాలో అని ఆలోచనలో పడితే అప్పుడు ఆయన మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) ఓ సలహా ఇస్తాడు.

బయిట ప్రపంచానికి తెలియకుండా ఆమెను మగపిల్లాడిలా నమ్మిస్తూ పెంచమంటాడు. ఆ క్రమంలో ఓ కొడుకులాగ రుద్రమదేవిని పెంచుతాడు. ఆమె పెరిగి పెద్దయ్యాక వివాహం సైతం ముక్తాంబ(నిత్యామీనన్ )ని ఇచ్చి చేస్తారు. ఇదే సమయంలో బందిపోటు గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) రుద్రమదేవితో పోరుకు సై అంటాడు. అప్పుడు ఏం జరిగింది...రుద్రమదేవి...మగపిల్లాడు కాదు...స్త్రీ అనే విషయం ఎలా రివీల్ అయ్యింది. ఆమెను ప్రేమించిన వీరభధ్రుడు (దగ్గుపాటి రానా) ఏం చేసి ఆమెను పొందాడు...రుద్రమదేవి తన ముందున్న సవాళ్ళను ఎలా ఎదుర్కొని వీర నారి అయ్యింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X