twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రుద్రమదేవి' రెండు రోజుల కలెక్షన్స్ ఇవే

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసింది ‘రుద్రమదేవి' టీమ్ . ఈ చిత్రం టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం అదరొకొట్టాయని చెప్తున్నారు. మొదటి రెండు రోజులు కలెక్షన్స్ ఆంధ్రా,తెలంగాణాలలో బాగున్నాయి. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి 13.60 కోట్ల రూపాయాలు రెండు రోజుల్లో సంపాదించింది. ఆ కలెక్షన్స్ వివరాలు క్రింద చూద్దాం

    ‘రుద్రమదేవి' 2 రోజుల కలెక్షన్స్ (షేర్):

    నైజాం: రూ5.15 కోట్లు

    సీడెడ్: రూ2.45 కోట్లు

    ఉత్తరాంధ్ర: రూ1.22 కోట్లు

    గుంటూరు: రూ1.36 కోట్లు

    కృష్ణా: రూ0.75 కోట్లు

    తూర్పు గోదావరి : రూ1.17 కోట్లు

    పశ్చిమ గోదావరి: రూ0.86 కోట్లు

    నెల్లూరు: రూ0.64 కోట్లు

    ‘రుద్రమదేవి' ఆంధ్రా& నైజాం లలో కెలక్టు చేసిన కలెక్షన్స్ మొత్తం : రూ13.60 కోట్లు

    Rudramadevi 2 Days AP/TS collections

    చిత్రం కథేమిటంటే...

    రుద్రమదేవి(అనుష్క) పుట్టేటప్పడికి కాకతీయ సామ్రాజ్య పరిస్దితులు బాగోలేవు... ఓ ప్రక్క దాయాదుల నుంచి, మరో ప్రక్క శత్రువుల నుంచి రాజ్యానికి ముప్పు ఉంది. మగపిల్లవాడు పుడితే తమ వారసుడుగా ఏలుతాడు అనుకుంటే పుట్టింది ఆడపిల్ల అని తెలిసి రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు) నిరాశపడతాడు. వారసుడు లేడు అని తెలిస్తే వెంటనే వారంతా దండెత్తే అవకాసం ఉందని ఏం చేయాలో అని ఆలోచనలో పడితే అప్పుడు ఆయన మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) ఓ సలహా ఇస్తాడు.

    బయిట ప్రపంచానికి తెలియకుండా ఆమెను మగపిల్లాడిలా నమ్మిస్తూ పెంచమంటాడు. ఆ క్రమంలో ఓ కొడుకులాగ రుద్రమదేవిని పెంచుతాడు. ఆమె పెరిగి పెద్దయ్యాక వివాహం సైతం ముక్తాంబ(నిత్యామీనన్ )ని ఇచ్చి చేస్తారు. ఇదే సమయంలో బందిపోటు గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) రుద్రమదేవితో పోరుకు సై అంటాడు. అప్పుడు ఏం జరిగింది...రుద్రమదేవి...మగపిల్లాడు కాదు...స్త్రీ అనే విషయం ఎలా రివీల్ అయ్యింది. ఆమెను ప్రేమించిన వీరభధ్రుడు (దగ్గుపాటి రానా) ఏం చేసి ఆమెను పొందాడు...రుద్రమదేవి తన ముందున్న సవాళ్ళను ఎలా ఎదుర్కొని వీర నారి అయ్యింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    English summary
    Rudrama Devis is the most awaited movie after baahubali. Gunashekhar has put an great efforts for rudhramadevi and the movie is finally arrived friday (oct 9th) . "Rudhramadevi" which has made superb collection at the Andhra Pradesh and Telangana (AP/T) box office on its first day has continued good run at Day 2.Rudrama Devis is the most awaited movie after baahubali. Gunashekhar has put an great efforts for rudhramadevi and the movie is finally arrived friday (oct 9th) . "Rudhramadevi" which has made superb collection at the Andhra Pradesh and Telangana (AP/T) box office on its first day has continued good run at Day 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X