Rudrangi Collections రుద్రంగి మూవీకి క్రేజీ రెస్పాన్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
రసమయి ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత, ఎమ్మెల్యే, డాక్టర్ రసమయి బాలకిషన్ నిర్మించిన చిత్రం రుద్రాంగి. రాజన్న, బాహుబలి, RRR చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేసిన అజయ్ సామ్రాట్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపందించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్లు జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమలరామన్, యువ నటీనటులు ఆశీష్ గాంధీ, గనవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించారు. జూలై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు ఏ రేంజ్ కలెక్షన్లను నమోదు చేసిందనే వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో దొరల పాలన, గడిలో అకృత్యాలు నేపథ్యంగా తెరకెక్కిన రుద్రంగి చిత్రాన్ని రాజీ లేకుండా భారీ వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేయాలని మొదలుపెట్టి.. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని బడ్జెట్ భారీగా పెంచారు. ఈ సినిమాను సుమారు 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రుద్రంగి సినిమా టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ప్రాజెక్టుపై మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారు 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
రుద్రంగి సినిమాకు తెలంగాణలోని కొన్ని జిల్లాలో మంచి స్పందన కనిపించింది. ఈ సినిమాకు ఆంధ్రాలో మిక్స్‌డ్ రెస్పాన్స్ కనిపించింది. అయితే ఈ సినిమా నైజాంలో తొలి రోజు 25 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. ఆంధ్రాలో ప్రధాన నగరాల్లో మోస్తారు ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

రుద్రంగి తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ప్రీమియర్లకు పెద్దగా స్పందన కనిపించలేదు. ఇక నైజాంలో, ఆంధ్రాలో కొంత మెరుగ్గా కలెక్షన్లను నమోదు అయ్యాయి. ఈ సినిమా తొలి రోజు అమెరికా, తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తంగా 1 కోటి నుంచి 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి.


Click it and Unblock the Notifications











