రూలర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య ఎంత రాబట్టాడంటే..?
జై సింహా అంటూ నందమూరి బాలకృష్ణ చేతిలో శత్రువులను చీల్చి చెండాడించాడు దర్శకుడు కేఎస్ రవికుమార్. అది నచ్చిన బాలయ్య మరో కథను ఆయన చేతిలో పెట్టాడు. ఈసారి రూలర్ అంటూ మరోసారి విజృంభించేలా చేశాడు. యాక్షన్స్ ఎపిసోడ్స్‌తో నింపేసిన రూలర్.. బాలయ్య అభిమానులను మెప్పించేలానే ఉంది. శుక్రవారం రిలీజైన ఈ చిత్రంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. మరి మొదటి రోజే ఈ చిత్రం ఎంత మేర రాబట్టిందో ఓ సారి చూద్దాం.

ఖర్చుకు వెనకడాని నిర్మాత..
బాలయ్య అంటే ఉన్న వల్లమాలిన అభిమానంతో ఈ సినిమాను కాస్త రిచ్‌గా తెరకెక్కించేందుకు బాగానే ఖర్చు పెట్టాడు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 23కోట్లకు క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ మొత్తాన్ని బాలయ్య రాబట్టి తన నిర్మాతను గట్టెక్కిస్తాడో లేదో చూడాలి.

ఏరియా వైజ్ బిజినెస్..
ఈ మూవీ అన్ని ఏరియాల్లో మంచి రేటుకే అమ్ముడుపోయింది. నైజాంలో 5.3, సీడెడ్‌లో 5.2, ఈస్ట్ 1.55, వెస్ట్ 1.4, గుంటూరు 2.7, కృష్టా 1.5, నెల్లూరు 1.1, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 21 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కర్ణాటన, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని ఇంకో రెండున్నర కోట్ల వరకు జరగ్గా.. మొత్తానికి ఈ చిత్రం 23-24కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

మొదటి రోజు హవా..
అన్‌లైన్ టికెట్ల సరళిని పరిశీలిస్తే మొదటి ఆట తరువాత బుకింగ్ శాతంలో పెరుగుదల కనిపించిందని తెలుస్తోంది. అసలే ఈ శుక్రవారం భారీ కాంపిటేషన్ నెలకొంది. ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. అయినా తెలుగు రాష్ట్రాల్లో రూలర్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

మొత్తంగా 5-6కోట్లు
ఆన్‌లైన్ టికెట్లే ఆ రేంజ్‌లో తెగుతుంటే బీ, సీ సెంటర్లలో ఇంకా ఏ రేంజ్‌లో అమ్ముడుపోయి ఉంటాయో అర్థమవుతుంది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.5 నుంచి 5 కోట్ల వరకు కొల్లగొట్టి ఉంటుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఆరుకోట్ల వరకు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

గట్టెక్కాలంటే..
ఈ మూవీ గట్టెక్కి, నిర్మాతకు డబ్బులు మిగలాలి అన్నా, హిట్ అని నిరూపించుకోవాలన్న కనీసం 24.5కోట్లను కొల్లగొట్టాల్సి ఉంటుంది. ఇంతటి పోటీలో మొదటి రోజే దాదాపు ఆరు కోట్లు వసూలు చేసిందంటే చెప్పుకోదగ్గ విషయమే. నిన్న రిలీజ్ అయిన మిగతా చిత్రాల్లో ఇదే టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మాస్ చిత్రాలకుండే పవర్ అదేనంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











