‘రన్ రాజా రన్’కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

By Srikanya

హైదరాబాద్ : దాదాపు 40దాకా షార్ట్ ఫిల్మ్ లు తీసి యు ట్యూబ్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా 'రన్ రాజా రన్'. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం యువతకు బాగానే నచ్చుతోంది. ఎ సెంటర్లలలో ఈ చిత్రం దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. ఈ చిత్రం కలెక్షన్స్ ఈ వీకెండ్ లో ఈ క్రింద విధంగా (ట్రేడ్ లో చెప్పుకుంటున్నవి) ఉన్నాయి.

Run Raja Run 1st Weekend WW Collections

నైజాం 1 కోటి

ఆంధ్రప్రదేశ్... 1.2 - 1.3 కోట్లు

ఇండియాలో మిగతా ప్రాంతాలలో 0.10 - 0.2 కోట్లు

ఓవర్ సీస్ 0.50 - 0.60 కోట్లు

మొత్తం ప్రపంచ వ్యాప్తగా వచ్చిన కలెక్షన్ షేర్ 3 కోట్లు

ఇందులో శర్వా చేసిన పాత్ర పేరు రాజా హరిశ్చంద్ర. ఎప్పుడూ నిజాలే చెబుతుంటాడు. అలా చెప్పడం వల్లే తనకి 50 మంది అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. మరో ప్రక్క తను ఇష్టపడి ప్రపోజ్ చేయ్యాలకునేలోపు వాళ్ళకి పెళ్లై పోయే సమస్య ఫేస్ చేసే అమ్మాయి. వీరిద్దరికి పరిచయం అయిన తర్వాత వారి జర్నీ ఎలా టర్న్ అయ్యింది అనేదే ఈ సినిమా. లవ్, కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. చెప్పాలంటే 'రన్ రాజా రన్' సినిమా 'టామ్ అండ్ జెర్రీ' ఫార్మాట్ లో ఉంటుంది.

దర్శకుడు మాట్లాడుతూ... 'రన్ రాజా రన్' అనే సినిమాలో లవ్ ట్రాక్ ఉంటూనే థ్రిల్లింగ్ మోమెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటే సెకండాఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. థియేటర్ కి వచ్చిన వారికి ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండేలా ఈ సినిమాని తీసాం. ఫ్యామిలీ మొత్తం వచ్చి హ్యాపీ గా చూడదగిన చిత్రం 'రన్ రాజా రన్' అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ..."లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'రన్ రాజా రన్' రూపొందింది. ఇందులో కథ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు ఉన్నాయి. కథకు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలో కథకు అవసరమైన పాత్రలే ఉంటాయి. '' అని చెప్పారు.

అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్ ఎం., ఛాయాగ్రహణం: మధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X