Ruslaan Collections సల్మాన్ ఖాన్ బావ మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే? .. హిట్టా? ఫట్టా?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బావ ఆయూష్ శర్మ నటించిన రస్లాన్ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. యంగ్ డైరెక్టర్ కరన్ లలిత్ బుటానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రస్లాన్ సినిమాకు టాలీవుడ్‌కు చాలా కనెక్టవిటీ ఉంది. ఈ చిత్రంలో తెలుగు నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించారు. ఇంకా ఈ సినిమాలో సుశ్రిల్ శ్రేయా మిశ్రా, విద్య మాల్వాడే, నవాబ్ సింగ్, సునీల్ శెట్టి తదితరులు నటించారు. ఈ సినిమా షూట్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే జరిగింది. (Ruslaan Collections in Telugu)

ఇక రస్లాన్ (Ruslaan Collections) సినిమాలో యువ, సీనియర్ నటులు మేలవింపులో రూపొందించారు. నటీనటులు పారితోషికం, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 20 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సిన పరిస్థితుల్లో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
రస్లాన్ సినిమాకు (Ruslaan Collections) పెద్దగా బజ్ లేని కారణంగా, ఐపీఎల్, మండుటెండలు కారణంగా ఈ సినిమా గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించలేదు. ఈ మూవీకి అంతంత మాత్రంగానే ఆక్యుపెన్సీ కనిపించింది. దాంతో పేలవంగా తొలి రోజు కలెక్షన్లు నమోదు అయ్యాయి. అయితే మౌత్ టాక్ పెరిగితే తప్ప ఈ సినిమా కలెక్షన్లు పుంజుకొనేలా లేవు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇదిలా ఉంటే.. రస్లాన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ సినిమా 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా సాధించిన కలెక్షన్లు కూడా ఎక్కువ శాతం నార్త్ ఇండియాలోనే కావడం గమనార్హం. ఈ మూవీ వీకెండ్‌లో బెటర్ వసూళ్లు సాధిస్తుందేమో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











