RX 100 వసూళ్ల దూకుడు.. రెండు రోజుల కలెక్షన్లు ఎంతో తెలుసా?

By Rajababu

యువతను విశేషంగా ఆకట్టుకొంటున్న RX 100 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. తొలి రోజున రూ.1.42 కోట్ల కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజుగా బాక్సాఫీస్ వద్ద బలంగా ఉంది. వారాంతంలో మరింత భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ప్రేక్షకాదరణ అనూహ్యంగా ఉండటంతో థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాత అశోక్ రెడ్డి వెల్లడించారు.

Recommended Video

RX 100,Vijetha Movies First day Collections
నైజాం, సీడెడ్‌లో కలెక్షన్లు

నైజాం, సీడెడ్‌లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో RX100 చిత్రానికి సంబంధించిన కలెక్షన్లు రెండో రోజున ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.50 లక్షలు, సీడెడ్‌లో 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.14 లక్షల వసూళ్లను సాధించింది.

 ఆంధ్రలో వసూళ్లు ఇలా..

ఆంధ్రలో వసూళ్లు ఇలా..

ఇక ఆంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో రూ.9.72 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.5.65 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.6.72 లక్షలు, గుంటూరులో రూ.7 లక్షలు, నెల్లూరులో రూ.3 లక్షల వసూళ్లను రాబట్టింది.

రెండు రోజుల్లో 2.5 కోట్ల వసూళ్లు

రెండు రోజుల్లో 2.5 కోట్ల వసూళ్లు

ఇంతకు ముందు పరిచయం లేని హీరో, దర్శక, నిర్మాతల కాంబినేషన్‌లో చిన్న చిత్రంగా విడుదలైన RX100 రెండు రోజుల్లో రూ.2.5 కోట్ల కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వారాంతంలో ఈ చిత్రం రూ.6 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పెంపు

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పెంపు

RX100 చిత్రంలో నటించిన పాయల్ రాజ్‌పుత్, కార్తీకేయ కెమిస్ట్రీ ప్రేక్షకులకు కిక్కెక్కిస్తున్నది. క్లైమాక్స్‌లో పాయల్ నటనకు, కార్తీకేయ స్క్రీన్ ప్రజెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో శుక్రవారం 60 థియేటర్లు పెంచడం జరిగిందని నిర్మాత అశోక్ రెడ్డి తెలిపారు. ఆదివారం కూడా థియేటర్లు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X