‘ఆర్ఎక్స్100’: మూడో రోజు కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ అని తేలిపోయింది!
'ఆర్ఎక్స్ 100' మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. పెద్ద స్టార్స్ లేక పోయినా... హీరో హీరోయిన్‌తో పాటు దర్శకుడు కూడా కొత్త వారే అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. సినిమా ఏదైనా కంటెంటు బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. తొలి మూడు రోజుల్లోనే మూడున్న కోట్లకుపైగా షేర్ సాధించిన ఈ మూవీ చిన్న సినిమాల కేటగిరీలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిపోయింది.

భారీ లాభాలు
ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 2.70 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో రూ. 3.76 కోట్ల షేర్ వసూలు చేయడంతో సినిమాకు మంచి లాభాలు వచ్చినట్లయింది. ఫుల్‌రన్‌లో భారీ లాభాలు ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మూడు రోజుల వసూళ్లు పరిశీలిస్తే తొలి రోజు రూ. 1.42 కోట్ల షేర్, రెండో రోజు రూ. 1.08 కోట్లు, మూడో రోజు రూ. 1.26 కోట్ల షేర్ రాబట్టింది.

మూడో రోజు షేర్ రూ. 1.26 కోట్లు
నైజాం - 60 లక్షలు
సీడెడ్ - 14.35 లక్షలు
ఉత్తరాంధ్ర -16.50 లక్షలు
ఈస్ట్ - 9.69 లక్షలు
వెస్ట్ - 7.03 లక్షలు
కృష్ణ - 8.13 లక్షలు
గుంటూరు - 8.63 లక్షలు
నెల్లూరు - 2.8 లక్షలు

రెండో రోజు షేర్ రూ.1.08 కోట్లు
నైజాం - 50 లక్షలు
సీడెడ్ - 12 లక్షలు
ఉత్తరాంధ్ర -14 లక్షలు
ఈస్ట్ - 9.72 లక్షలు
వెస్ట్ - 5.65 లక్షలు
కృష్ణ - 6.72 లక్షలు
గుంటూరు- 7 లక్షలు
నెల్లూరు - 3 లక్షలు

మొదటి రోజు షేర్ రూ. 1.42 కోట్లు
నైజాం - 65 లక్షలు
సీడెడ్ - 20 లక్షలు
ఉత్తరాంధ్ర -14 లక్షలు
ఈస్ట్- 13.69 లక్షలు
వెస్ట్ - 7.32 లక్షలు
కృష్ణ - 8.44 లక్షలు
గుంటూరు - 9 లక్షలు
నెల్లూరు - 4 లక్షలు


Click it and Unblock the Notifications











