ఆర్ఎక్స్ 100 నాలుగో రోజు కలెక్షన్స్.... వంద శాతం లాభాలు!
కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఎక్స్ 100' మూవీ ఆదివారంతో బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 4వ రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు మొత్తం రూ. 5,18,04,822 షేర్ వసూలు చేసిన ఈ చిత్రం సినిమాను కొనుగోలు చేసిన అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లకు వంద శాతం లాభాలు తెచ్చిపెట్టింది. నైజాంలో తొలి రోజు కలెక్షన్లతోనే డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడికి మించిన లాభాలు రాగా..... నెల్లూరు ఏరియాలో కాస్త లేటుగా 4వ రోజు కలెక్షన్లతో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు.

నైజాం ఏరియాలో తొలి రోజే ఓవర్ ఫ్లో...
‘ఆర్ఎక్స్ 100' మూవీ నైజాం ఏరియాలో తొలి రోజే పెట్టుబడికి మించిన షేర్ రావడంతో ఓవర్ ఫ్లో పరిస్థితి ఎదురైంది. తొలి 4 రోజుల్లో ఈ చిత్రం నైజాంలో రూ. 2, 42, 10, 653 షేర్ వసూలు చేసింది.

సీడెడ్ ఏరియాలో
సీడ్ ఏరియాలో ఈ చిత్రం తొలి 4 రోజుల్లో రూ. 58, 75, 410 వసూలు చేసింది. ఇక్కడ మూడో రోజుతో డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు జోరందుకున్నాయి.

ఈ ఏరియాల్లో రెండో రోజుతో లాభాల్లోకి...
ఆర్ఎక్స్ 100 తొలి 4 రోజుల కలెక్షన్స్ వైజాగ్‌లో రూ. 61,19, 959... గుంటూరు రూ. 36,46,663... ఈస్ట్ రూ. 42,53,309.. వెస్ట్ రూ. 31,54,193.. కృష్ణ రూ. 34,86,838 గా నమోదైంది. ఈ ఏరియాలన్నింటిలోనూ డిస్ట్రిబ్యూటర్లు తొలి రెండు రోజుల్లోనే లాభాల బాట పట్టడం విశేషం.

నెల్లూరులో కాస్త లేటుగా
అయితే నెల్లూరు ఏరియాలో ఆర్ఎక్స్ 100 సినిమా 4వ రోజుతో లాభాల బాట పట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఇక్కడ రూ. 10,58,161 వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











