ఆర్ఎక్స్ 100 సంచలనం..... బాహుబలి-2 బీట్ చేసి సరికొత్త రికార్డ్!

By Bojja Kumar

బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తూ డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తున్న 'ఆర్ఎక్స్ 100' తాజాగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరరెక్కిన ఈ చిత్రం రూ. 300 కోట్ల రేంజిలో తెరకెక్కిన 'బాహుబలి-2' లాంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టేయడం బాక్సాఫీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది. సినిమాకు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. పెద్ద సినిమాలు పోటీలో లేక పోవడం, ఉన్న సినిమాలు పోటీ ఇవ్వక పోవడంతో 'ఆర్ఎక్స్ 100' కలెక్షన్ల విజయ యాత్ర కొనసాగుతోంది.

దేవి 70 ఎంఎం థియేటర్లో సరికొత్త రికార్డ్

దేవి 70 ఎంఎం థియేటర్లో సరికొత్త రికార్డ్

‘ఆర్ఎక్స్ 100' ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్లో తొలి వారం ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఫస్ట్ వీక్ ఇక్కడ ఈ చిత్రం ఇక్కడ రూ. 29,32,867 వసూలు చేసింది.

బాహుబలి-2 రికార్డు బద్దలు

బాహుబలి-2 రికార్డు బద్దలు

దేవి 70 ఎంఎం థియేటర్ చరిత్రలో ఇప్పటి వరకు తొలి వారం అత్యధికంగా రూ. 28,82,370 వసూలు చేసిన సినిమా నిన్నమొన్నటి వరకు ‘బాహుబలి-2' ఉండేది. అయితే ఈ రికార్డును ఆర్ఎక్స్ 100 రూ. 29,32,867 వసూలు చేయడం ద్వారా బీట్ చేసింది.

మూడో స్థానంలో తొలి ప్రేమ

మూడో స్థానంలో తొలి ప్రేమ

మూడో స్థానంలో వరుణ్ తేజ్, రాఖీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలి ప్రేమ' చిత్రం ఉంది. ఈ చిత్రం తొలివారం ఇక్కడ రూ. 28,67,367 వసూలు చేసింది.

 భారీ వసూళ్లు

భారీ వసూళ్లు

‘ఆర్ఎక్స్ 100' చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 2.70 కోట్లకు అమ్మారు. తొలి వారం ఈ మూవీ రూ. 7.53 కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుండికి రెండింతల లాభం వచ్చినట్లయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X