ఆర్ఎక్స్ 100 కలెక్షన్స్: 6వరోజు కూడా అదే జోరు.. 15 కోట్లతో టాప్ గేర్‌లో, బడ్జెట్ ఎంతో తెలుసా!
Recommended Video

చిన్న చిత్రాలు హిట్ అయితే చాలు నిర్మాతకు లాభాల పంట పడుతుంది. చిన్నచిత్రాలు విజయం సాధిస్తే పెట్టుబడికి రెండు రెట్లు, మూడు రేట్లు అధికంగా లాభాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ కోవలోకే ఇటీవల విడుదలైన ఆర్ ఎక్స్ 100 చిత్రం వస్తుంది. బోల్డ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తోంది. ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

బ్రహ్మరథం
కార్తీకేయ, పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంలో జంటగా నటించారు. వీరిద్దరి పెర్ఫామెన్స్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ కుర్రకారుని బాగా ఆకర్షిస్తున్నాయి.

భారీ విజయం దిశగా
ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చూస్తే ఇటీవల విడుదలైన చిన్న చిత్రాలలో పెద్ద విజయం దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 2 కోట్ల అతితక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అంతకు 10 రేట్లు వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.

ఆరవరోజు కూడా
ఆరవరోజు కూడా ఈ చిత్ర వసూళ్లు స్ట్రాంగ్ గా కొనసాగుతున్నాయి. కేవలం 2 రోజే ఈ చిత్రం 78 లక్షల షేర్ రాబట్టింది. అన్ని ఏరియాలలో తిరుగులేని వసూళ్లు నమోదవుతున్నాయి.

15 కోట్లకు పైగా
ఆరు రోజుల్లో ఆర్ఎక్స్ 100 చిత్రం 15 కోట్లకుపైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రాబట్టింది. ఇందులో షేర్ విలువ 7.5 కోట్లు ఉండడం విశేషం.

ఏరియాల వారీగా
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎక్స్ 100 చిత్రం 6.9 కోట్లు షేర్ వసూలు చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో దూసుకుపోతోంది. దాదాపు 3 కోట్ల వరకు షేర్ రాబట్టింది. యుఎస్ లో దాదాపు 70 లక్షల గ్రాస్ వసూలు చేసింది. రాబోవు రోజుల్లో ఈ చిత్రం 20 కోట్ల గ్రాస్ అధికమించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











