'S/O సత్యమూర్తి’ ఫస్ట్ డే కలెక్షన్ ఏరియా వైజ్...
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ బన్నీ హీరోగా తెరకెక్కిన 'S/O సత్యమూర్తి' సినిమాపై ముందు నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా రాజేంద్రప్రసాద్, కోట, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం, అలీ లాంటి ప్రముఖులు ఉండటం, యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ అనే పేరు రావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసారు.
తాజాగా సినిమా ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్లు బయటకు రిలీజ్ అయ్యాయి. ఆ వివరాల ప్రకారం ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 9.34 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్లోంది. ఏరియా వైజ్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం: 3.16 కోట్లు
సీడెడ్: 1.71 కోట్లు
కృష్ణా: 0.59 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.96 కోట్లు
నెల్లూరు: 0.40 కోట్లు
గుంటూరు: 1.02 కోట్లు
ఈస్ట్ గోదావరి: 0.81 కోట్లు
వెస్ట్ గోదావరి: 0.68 కోట్లు
టోటల్ ఫస్ట్ డే షేర్: రూ. 9.34 కోట్లు
'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్.వో- ఎస్.కె.ఎన్, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.


Click it and Unblock the Notifications











