‘S/o సత్యమూర్తి’ కలెక్షన్ 57.9 కోట్లు: నిర్మాత ప్రకటన

By Bojja Kumar

హైదరాబాద్: ‘S/o సత్యమూర్తి' చిత్రం తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 57.9 కోట్లు గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిందని నిర్మాత రాధాకృష్ణ ప్రకటించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. నిర్మాత చెప్పిన గ్రాస్ కలెక్షన్ల సంగతి ఇలా ఉంటే....తొలి వారం చిత్రం దాదాపు రూ. 37 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి. టోటల్ కలెక్షన్స్ ను గ్రాస్ కలెక్షన్లుగా.... థియేటర్ల రెంట్, ఇతర ఖర్చలు పోగా మిగిలిన మొత్తాన్ని షేర్‌గా పిలుస్తారు.

 S/o Satyamurthy collected 57.90 cr

తెలంగాణ: రూ. 15.8 కోట్లు

ఆంధ్రప్రదేశ్ - రూ. 22.8 కోట్లు

కర్ణాటక - 8.2 కోట్లు

తమిళనాడు - 1.5 కోట్లు

రెస్టాఫ్ ఇండియా - 0.9 కోట్లు

ఓవర్సీస్ - రూ. 8.7 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ = 57.90 కోట్లు

విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X