Devara Rights: ఎస్ఎస్ కార్తికేయ చేతికి ఎన్టీఆర్ ‘దేవర’.. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే!

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా ఎందులో అయినా తనదైన శైలిని చూపించి టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌పై ప్రభావాన్ని చూపించిన అతడు.. RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీంతో అప్పటి నుంచి తారక్ మరింత ఉత్సాహంతో ముందుకు సాగిపోతోన్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీని రెండు భాగాలుగా తీస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో షెడ్యూళ్లను పూర్తి చేసుకుని షూట్ దాదాపుగా కంప్లీట్ చేశారు.

S S Karthikeya Bagged Jr NTR Starrer Devara Movie Karnataka Rights With Huge Amount

హిట్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'దేవర' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ బిజినెస్‌ను సైతం ఎప్పుడో మొదలు పెట్టేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ డీల్‌కు క్లోజ్ చేసుకుంది. అలాగే, థియేట్రికల్ రైట్స్‌కు సంబంధించిన డీల్స్‌ను కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ అవుతున్నాయి.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన కర్నాటక డీల్ తాజాగా క్లోజ్ అయింది. ఈ మూవీ కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల వెర్షన్లను కర్నాటకలో విడుదల చేసే రైట్స్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో పాటు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడు తాజాగా సోషల్ మీడియా ద్వారా దీన్ని వెల్లడించాడు.

S S Karthikeya Bagged Jr NTR Starrer Devara Movie Karnataka Rights With Huge Amount

'దేవర' సినిమాకు సంబంధించిన కర్నాటక హక్కులను దక్కించుకున్న కార్తికేయ 'అతడి కోట, అతడి ఎదుగుదల, అతడి విజయం.. అంతా నా తారక్ అన్న ప్రేమ కోసం. కర్నాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశాడు. ఇక, కార్తికేయ ఇటీవలే 'ప్రేమలు' సినిమాతో డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించాడు. అది భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం 'దేవర' కూడా హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. అత్యంత పవర్‌ఫుల్ స్టోరీతో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: devara jr ntr s s karthikeya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X