twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సాహో సంచలనం: బాహుబలి, రంగస్థలం రికార్డు బ్రేక్

    |

    సాహో చిత్రంపై టాక్ ఎలా ఉన్న కలెక్షన్లకు ఎదురు లేకుండా సంచలనాలు నమోదు చేస్తున్నది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు, దక్షిణాది రాష్ట్రాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది. ఒకవైపు నెగిటివ్ టాక్ హోరెత్తుతున్నా.. మరోవైపు సినిమా కలెక్షన్లు అంతకు మించి అనేలా ఉన్నాయి. ఈ చిత్రం పలు ప్రాంతాల్లో ఓ రెంజ్ కలెక్షన్లు సాధిస్తున్నది. గత 4 రోజుల్లో సాహో సాధించిన వసూళ్లు ఇవే..

    కలెక్షన్లకు అడ్డా ఆర్టీసీ క్రాస్‌రోడ్

    కలెక్షన్లకు అడ్డా ఆర్టీసీ క్రాస్‌రోడ్

    తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలను పరిగణనకు తీసుకొన్నా.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు మాత్రం సినీ కలెక్షన్లకు, మూవీ స్టామినాకు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఏ సినిమానైనా జెండా ఎగురేస్తే ప్రపంచమంతటా అందుకు మార్గదర్శకంగా నిలుస్తుంది. సాహో విషయంలో కూడా అదే జరిగింది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోనే రూ.1 కోటి గ్రాస్ వసూళ్లను సాధించింది.

    బాహుబలి సరసన చేరిన సాహో

    బాహుబలి సరసన చేరిన సాహో

    గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు అడ్డాలో బాహుబలి2 చిత్రం కూడా నాలుగు రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూళు చేసింది. ఇక సంచలన విజయం సాధించిన రంగస్థలం, బాహుబలి చిత్రాలు మాత్రం 9 రోజుల్లో రూ.1 కోటి సాధించాయి. ఇక మహర్షి కోటి రూపాయల క్లబ్‌లో 10 రోజుల తర్వాత చేరింది. ఇక 2.0 చిత్రం కోటిని కొల్లగొట్టేందుకు 11 రోజుల సమయాన్నితీసుకొంది.

    గతంలో తెలుగు సినిమాలు

    గతంలో తెలుగు సినిమాలు

    ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో కోటి రూపాయాల క్లబ్‌లో చేరిన వాటిలో శ్రీమంతుడు (11 రోజుల్లో), అరవింద సమేత (12 రోజుల్లో), భరత్ అనే నేను (13 రోజుల్లో), ఖైదీ నంబర్ 150 (17 రోజుల్లో), అత్తారింటికి దారేది (17 రోజుల్లో), ఎఫ్2 (25 రోజుల్లో), ఫిదా (25 రోజుల్లో) ఉన్నాయి.

    దేశవ్యాప్తంగా రికార్డు వసూళ్లు

    దేశవ్యాప్తంగా రికార్డు వసూళ్లు

    ఇక దేశవ్యాప్తంగా కూడా సాహో సంచలన వసూళ్లను సాధిస్తున్నది. సాహో వసూళ్లపై ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ భాస్కర్ స్పందించారు. ప్రభాస్ వర్సెస్ ప్రభాస్.. యంగ్ రెబల్ స్టార్ నటించిన సినిమాల వీకెండ్ వసూళ్లు ఇలా ఉన్నాయంటూ.. 2015లో బాహుబలి చిత్రం వారాంతానికి రూ.22.35 కోట్లు సాధిస్తే.. 2017లో బాహుబలి2 రూ.128 కోట్లు సాధించింది. ఇక 2019లో సాహో చిత్రం రూ.79.08 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది అంటూ ట్వీట్ చేశారు.

     లాంగ్ వీకెండ్ కలిసి

    లాంగ్ వీకెండ్ కలిసి

    సాహో చిత్రానికి లాంగ్ వీకెండ్ కలిసి వచ్చిందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. వారాంతం తర్వాత కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తే.. బాహుబలి2 వసూళ్లను సాహో తిరగరాయడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు. వాజీ సిటీలో జరిగిన రెండు లక్షల కోట్ల దోపిడికి సంబంధించిన కథగా సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

    English summary
    After Bahubali the face of Telugu Cinema among all its linguistic counterparts in India has changed. It is not even exaggeration in saying Bahubali became the face of Indian Cinema in the world. Makers are now investing more time and money in Telugu cinema than they used to spend before Bahubali series smashed all the Indian box office records. This film collects, one crore in RTC X roads in 4 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X