‘సాహో’ దెబ్బకు హిందీ బాక్సాఫీస్ షేక్ అవుతోంది, ప్రభాస్ మూడోసారి...
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహో' మూవీ కేవలం సౌతిండియాలో మాత్రమే కాదు... బాలీవుడ్లోనూ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ చిత్రం అక్కడ తొలిరోజు రూ. 24.40 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగాయి. రెండో రోజైన శనివారం రూ. 25.20 కోట్లు, ఆదివారం రూ. 29.48 కోట్లు వసూలు చేసింది. అయితే సోమవారం వినాయక చవితి హాలిడే అయినప్పటికీ అందరూ పండగ సంబరాల్లో మునిగిపోవడంతో వసూళ్లు డ్రాప్ అయి రూ. 14.20 కోట్లు వసూలు చేసింది.

5వ రోజు రూ. 100 కోట్లు క్రాస్ అయిన సాహో
మంగళవారంతో ‘సాహో' మూవీ విజయవంతంగా 5 రోజులు పూర్తి చేసుకుంది. వర్కింగ్ డే కావడంతో ఐదవరోజు రూ. 9.10 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో టోటల్ 5 డేస్ కలెక్షన్ రూ. 102.38 కోట్లకు రీచ్ అయింది. సౌత్ సినిమా యాక్టర్ల చిత్రాలు హిందీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్క్ దాటడం చాలా అరుదు.

ప్రభాస్ వరుసగా మూడోసారి ఆ ఘనత సాధించాడు
బాలీవుడ్ మార్కెట్లో సౌత్ సినిమాలు రూ. 100 కోట్ల మార్కును అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకు ముందు ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2, రజనీకాంత్ 2.0 మాత్రమే ఈ పీట్ సాధించాయి. ఇపుడు ‘సాహో' మళ్లీ ఆ ఘనత సాధించింది. టాప్ 4 చిత్రాల్లో మూడు తమ హీరో సినిమాలే ఉండటంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

5 రోజుల కలెక్షన్ రోజు వారీగా
ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ హిందీ బాక్సాఫీస్ 5 డేస్ కలెక్షన్ల వివరాలు వెల్లడించారు. ‘‘ 5వ రోజు సాహో కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. మాస్ సర్వ్కూట్లో సినిమా బాగా రన్ అవుతోంది. 4వ రోజు హాలిడే కావడంతో డబుల్ డిజిట్ సాధించింది. తొలివారం 110 కోట్లకుపైగా సాధించడం ఖాయం. శుక్ర రూ. 24.40 కోట్లు, శని రూ. 25.20 కోట్లు, ఆది రూ. 29.48 కోట్లు, సోమ రూ. 14.20 కోట్లు, మంగళ రూ. 9.10 కోట్లు. ఇప్పటి వరకు మొత్తం: 102.38 కోట్ల నెట్. " అని ట్వీట్ చేశారు.

సాహో వరల్డ్ వైడ్
సాహో హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విడుదలైంది. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలెక్షన్ పరిగణనలోకి తీసుకుంటే, ఈ చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ .350 కోట్లు వసూలు చేసింది. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ చేసిన రెండవ చిత్రం ఇది. సాహో మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి సుమారు రూ. 68 కోట్ల రాబట్టింది. ఇది బాహుబలి: ది కన్‌క్లూజన్(రూ. 121 కోట్లు) కంటే తక్కువే.


Click it and Unblock the Notifications











