సాహో, బాహుబలి, బాహుబలి 2... ఓపెనింగ్స్ పరంగా ఏ మూవీ అదరగొట్టిందంటే?
బాహుబలి, సాహో రెండు ప్రభాస్ నటించిన సినిమాలే అయినప్పటికీ విభిన్నమైన చిత్రాలు, ఏ కోణంలోనూ కంరేజ్ చేయకూడని చిత్రాలు. అయితే అభిమానులు, ట్రేడ్ విశ్లేషకులు ఈ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ కంపేర్ చేస్తున్నారు. 'సాహో' కలెక్షన్ల పరంగా బాహుబలి సిరీస్ బాక్సాఫీస్ కలెక్షన్లకు దరి దాపుల్లో లేదనే చెప్పాలి. అయితే భారీ ఓపెనింగ్స్ సాధించే సత్తా తనకు ఉందని ప్రభాస్ మరోసారి నిరూపించారు.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ఇండియాలో తొలి రోజు రూ. 68 కోట్లు రాబట్టిందీ. వరల్డ్ వైడ్ మొత్తంగా రూ. 130 కోట్లు వసూలు చేసినట్లు అంచనా.

తొలి రోజు వసూళ్ల పరంగా కంపేర్ చేస్తే
బాహుబలి-ది బిగినింగ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు రూ. 119 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. బాహుబలి-ది కంక్లూజన్ దాదాపు రూ. 121 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు చిత్రాలతో పోలిస్తే ‘సాహో' తొలి రోజు ఇండియా వసూళ్లు తక్కువే అని చెప్పక తప్పదు.

రెండో రోజు వసూళ్లు ఇలా...
‘సాహో' మూవీకి మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాపీస్ వద్ద వసూళ్లు స్టడీగా ఉన్నాయి. రెండో రోజు రూ. 65 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ వసూళ్లు కూడా బాహుబలి సిరీస్ సాధించిన సెకండ్ డే వసూళ్లకు చాలా దూరంగా ఉంది. రెండో రోజు ఇండియాలో బాహుబలి మూవీ రూ. 121 వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే రూ. 385 కోట్లు రాబట్టింది.

భారీ బడ్జెట్ చిత్రాలతో విసిగిపోయిన ప్రభాస్
బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్-ఇండియన్ హీరోగా ఎదిగారు. అయితే వరసగా ఈ పెద్ద బడ్జెట్ సినిమాలు చేయడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న ప్రభాస్ ‘సాహో' ప్రమోషన్ల సందర్భంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు చేయడానికే ఆసక్తి చూపుతానని తెలిపారు.

సాహో
ప్రభాస్‌తో పాటు శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, ఎవెలిన్ శర్మ, చంకీ పాండే, అరుణ్ విజయ్, మందిరా బేడి సాహోలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విమర్శకుల నుంచి కూడా నెగెటివ్ రివ్యూలు రావడంతో ఈ మూవీ ఎంత వసూలు చేస్తుంది అనేది చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











