యూఎస్ఏ, ఏపీ, తెలంగాణలో ‘సాహో’ 2 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్ రిపోర్ట్
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహో'కు మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. రెండో రోజు సాహో రూ. 10.30 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. దీంతో 2 రోజుల మొత్తం షేర్ రూ. 46.30 కోట్లకు చేరుకుంది.
నైజాం ఏరియాలో 'సాహో'కు మంచి స్పందన వస్తోంది. రెండో రోజు ఇక్కడ రూ. 5.20 కోట్ల షేర్ వసూలైనట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజు వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. సీడెడ్ ఏరియాల్లో కాస్త ఫర్వాలేదు. ఆదివారం సెలవు దినం కావడం, సోమవారం వినాయక చవితి హాలిడే కావడంతో కలెక్షన్స్ స్టడీగా ఉండే అవకాశం ఉంది.

ఏరియా వైజ్ 2 డేస్ టోటల్ షేర్ వసూళ్లు పరిశీలిస్తే నైజాం రూ. 14.62 కోట్లు, సీడెడ్ రూ. 6.05 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 5.21 కోట్లు, గుంటూరు రూ. 5.43 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 4.98 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 3.95 కోట్లు, కృష్ణ 3.13 కోట్లు, నెల్లూరు రూ. 2.89 కోట్లుగా ఉంది.
యూఎస్ఏలో వసూళ్ల వివరాల్లోకి వెళితే.. గురువారం ప్రీమియర్ షోల ద్వారా $921,342 రాబట్టింది. శుక్రవారం $546,187, $450,018 వసూలయ్యాయి. దీంతో టోటల్ షేర్ 1,917,547 రీచ్ అయింది. ఆదివారంతో ఈ మూవీ 2 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరనుంది.


Click it and Unblock the Notifications











