Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘సాహో’ వరల్డ్ వైడ్ 10 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్ రిపోర్ట్ అదరహో...
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత అభిమానుల అంచనాలను రీచ్ అయ్యేలా రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ 'సాహో'. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలైంది. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెకండ్ వీకెండ్(10 డేస్) పూర్తి చేసుకుంది.
భారీ అంచనాలతో విడుదలైన 'సాహో'పై అభిమానులు సంతృప్తిగా ఉన్నప్పటికీ రిలీజ్ రోజే నెగెటివ్ రివ్యూలు రావడంతో ప్రజల్లోకి మిక్డ్స్ టాక్ స్ప్రెడ్ అయింది. అయినప్పటికీ యువి క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూనే ఉంది.
|
వరల్డ్ వైడ్ 10 డేస్ గ్రాస్
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘సాహో' మూవీ గడిచిన 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయానని వెల్లడిస్తూ ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా ఓ ట్వీట్ చేశారు.
|
హిందీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సౌత్ మీరో నటించిన చిత్రం రూ. 100 కోట్లు దాటడం అంటే మామూలు విషయం కాదు. ‘సాహో' చిత్రానికి అక్కడ మంచి రెస్పాన్స్ వస్తోంది. 10 రోజుల్లో హిందీ వెర్షన్ ఆలిండియా వైడ్ రూ. 131 కోట్లు(నెట్) రాబట్టినట్లు సమాచారం.
తెలుగు బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఎలా ఉందంటే..
టాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘సాహో' తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 10 రోజుల్లో రూ. 77.80 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. శనివారం(సెప్టెంబర్ 7)తో పోలిస్తే ఆదివారం(సెప్టెంబర్ 8) వసూళ్లు పుంజుకున్నట్లు చెబుతున్నారు.
ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ 10 డేస్
ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ 10 డేస్ షేర్ పరిశీలిస్తే... నైజాం రూ. 27.40 కోట్లు, సీడెడ్ రూ. 11.40 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 9.54 కోట్లు, గుంటూరు రూ. 7.75 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 7.14 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 5.46 కోట్లు, కృష్ణ రూ. 4.97 కోట్లు, నెల్లూరూ రూ. 4.14 కోట్ల షేర్ వసూలు చేసింది.
యూఎస్ఏలో 3 మిలియన్
మరో వైపు యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ‘సాహో' చిత్రం శనివారం(సెప్టెంబర్ 7) నాటికే 3 మిలియన్ మార్క్ అందుకుంది. సెకండ్ వీకెండ్ కూడా ఇక్కడ పూర్తయింది కాబట్టి ఇకపై పెద్దగా రాబడి ఉండక పోవచ్చని, ఫుల్ రన్లో మరో 2 లక్షల నుంచి 3 లక్షల డాలర్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.