twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ డే 2 రిపోర్ట్: నెగెటివ్ టాక్‌లోనూ కలెక్షన్స్ కుమ్మేసింది!

    |

    ప్రభాస్, శ్రద్ధా కపూర్ 'సాహో' మూవీ ఆగస్టు 30న విడుదలై బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ. 130 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంపై రిలీజ్ ముందు నుంచే భారీ అంచనాలు ఉండటం, ఫస్ట్ వీకెండ్ వరకు టికెట్లు ముందే అడ్వాన్స్ బుకింగ్ జరుగడంతో రెండోరోజు కూడా బిజినెస్ అదరగొట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల వసూళ్లు కలిపి రూ. 205 కోట్ల మార్కును రీచ్ అయినట్లు తెలుస్తోంది.

    'సాహో' హిందీ వెర్షన్ ఇండియాలో తొలి రోజు రూ. 24.40 కోట్లు రాబట్టింది. 2019 సంవత్సరంలో ఇది థర్డ్ హయ్యెస్ట్ గ్రాసర్. దీనికంటే ముందు స్థానంలో రూ. 42.30 కోట్లతో సల్మాన్ ఖాన్ భారత్, రూ. 29.16 కోట్లతో మిషన్ మంగళ్ చిత్రాలు ఉన్నాయి.

    సౌతిండియా మార్కెట్లో

    సౌతిండియా మార్కెట్లో

    సౌతిండియా మార్కెట్ పరంగా చూసుకుంటే...‘బాహుబలి-ది కంక్లూజన్' తర్వాత హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. తెలుగు, తమిళంలో సాహో దాదాపు రూ. 87 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. 2017లో విడుదలైన ‘బాహుబలి 2' ఓపెనింగ్ డే రూ. 121 కోట్లు వసూలు చేసింది. మొన్నటి వరకు రెండో స్థానంలో రజనీకాంత్-శంకర్ మూవీ 2.0 (రూ. 50 కోట్లు) ఉండేది. అయితే ఇపుడు ఆ స్థానాన్ని ‘సాహో' సొంతం చేసుకుంది.

    రిలీజ్ తర్వాత పరిస్థితి ఇలా

    రిలీజ్ తర్వాత పరిస్థితి ఇలా

    ‘సాహో' మూవీ రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అందుకు తగిన విధంగానే ఇండియా బ్యాప్తంగా భారీగా విడుదల చేశారు. రిలీజ్ ముందు ఈ చిత్రంపై హైప్ ఓ రేంజిలో ఉండేది. అయితే రిలీజ్ తర్వాత క్రిటిక్స్ నుంచి నెగెటివ్ రివ్యూలు రావడంతో పరిస్థితి తలక్కిందులైంది. ‘సాహో' భరించలేని విధంగా ఉందంటూ ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కామెంట్ చేసి కేవలం ఒకటిన్నర రేటింగ్ ఇవ్వడం తెలిసిందే.

    ఎంత వసూలు చేస్తుందో?

    ఎంత వసూలు చేస్తుందో?

    ఇండియాలో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రాల్లో ‘సాహో' ఒకటి. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్లు ఉండేలా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించారు. ఈ క్రమంలో రూ. 150 కోట్ల బడ్జెట్ అంచనాలతో మొదలైన ఈ చిత్రం ఖర్చు రూ. 350 కోట్లకు చేరుకుంది. అదే ఇపుడు ఈ సినిమాకు గుదిబండగా మారింది. సినిమాకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తున్న తరుణంలో వసూళ్లు ఎంత రాబడుతుంది అనేది హాట్ టాపిక్ అయింది.

    ‘సాహో’

    ‘సాహో’

    ప్రభాస్‌తో పాటు శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, ఎవెలిన్ శర్మ, చంకీ పాండే, అరుణ్ విజయ్, మందిరా బేడి సాహోలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగు, తమిళం, హిందీ భాషల నుంచి నటీనటులను ఎంపిక చేశారు.

    English summary
    Saaho Day 2 Box Office Collection report out. The movie as generated over Rs 130 crore opening day, on day 2, Saaho taking the gross earning to nearly Rs 220 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X