twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3 మిలియన్ క్లబ్‌లో ‘సాహో’ ... లాభాలు వచ్చే ఛాన్స్ ఉందా?

    |

    ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. యువి క్రియేషన్స్ సంస్థ ఈ యాక్షన్ మూవీని రూ. 350 కోట్ల ఖర్చుతో హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో గ్రాండ్‌గా తెరకెక్కించింది. ఈ చిత్రంపై ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

    అయితే రిలీజ్ తర్వాత నెగెటివ్ రివ్యూలు రావడం, మిక్డ్స్ టాక్ కారణంగా ఫస్ట్ వీకెండ్, గణేష్ చతుర్థి తర్వాత వసూళ్ల జోరు ఆశించిన స్థాయిలో లేదు. నెంబర్ పరంగా చూస్తే ఇండియాతో పాటు యూఎస్ఏలోనూ భారీగానే ఉంది. అయితే డిస్ట్రిబ్యూటర్ పెట్టుబడి, రికవరీ ఛాన్స్ పరంగా చూస్తే మాత్రం... గట్టెక్కాలంటే ఈ భారీ చిత్రం ఇంకా భారీగా వసూలు చేయాల్సి ఉంది.

    యూఎస్ఏలో 3 మిలియన్ క్లబ్

    యూఎస్ఏలో 3 మిలియన్ క్లబ్

    యూఎస్ఏ బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం... ‘సాహో' శనివారం(సెప్టెంబర్ 7)తో 3 మిలియన్ క్లబ్‌లో చేరింది. ఈ ఫీట్ సాధించిన 5వ తెలుగు సినిమా ఇది. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఇంత భారీ మొత్తం సాధించడం అంటే మామూలు విషయం కాదు.

    సాహో కంటే ముందు స్థానంలో...

    సాహో కంటే ముందు స్థానంలో...

    తెలుగు సినిమాల కేటగిరీలో యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద రూ. 12 మిలియన్ వసూళ్లతో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బాహుబలి(6.9 మిలియన్), రంగస్థలం(3.5 మిలియన్), భరత్ అనే నేను(3.4 మిలియన్) ఉన్నాయి.

    ఆ చిత్రాన్ని సాహో వెనక్కి నెట్టుతుందా?

    ఆ చిత్రాన్ని సాహో వెనక్కి నెట్టుతుందా?

    ‘సాహో' చిత్రానికి యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇకపై కలెక్షన్లు పెద్దగా వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఫుల్ రన్‌లో మరో రెండు మూడు లక్షల డాలర్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భరత్ అనే నేను(3.4 మిలియన్)ను అందుకోవడం కష్టమే.

    లాభాలు వచ్చే అవకాశం ఉందా?

    లాభాలు వచ్చే అవకాశం ఉందా?

    ‘సాహో'ఓవర్సీస్ హక్కులు ఔట్‌రైట్ రూ. 42 కోట్లకు అమ్మారు. యూఎస్ఏలో భారీగా వసూలైతేనే డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే లాభాలు రావడం అంత ఈజీ కాదు అనే వాదన వినిపిస్తోంది.

    English summary
    Saaho movie finally entered $3 million club in the US on its second Saturday. Saaho written and directed by Sujeeth. It was produced by Vamsi Krishna Reddy, Pramod Uppalapati and Bhushan Kumar under their respective banners of UV Creations and T-Series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X