twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్, టాప్ 2 కానీ...

    |

    Recommended Video

    Saaho 1st Week Box-Office Collections Report

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సాహో' బాక్సాఫీస్ వద్ద గురువారంతో తొలివారం పూర్తి చేసుకుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈచిత్రం విడుదలైన తొలిరోజు నుంచి వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన చాలా మంది డిస్ట్రిబ్యూటర్ల మొహాల్లో మాత్రం ఆనందం కనిపించడం లేదు.

    ఫస్ట్ వీక్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వసూలైన డిస్ట్రిబ్యూటర్ షేర్ ప్రకారం... చూస్తే ఆల్ టైమ్ టాప్ 2. బాహుబలి 2 తర్వాత తొలివారం అత్యధిక షేర్ సాధించిన చిత్రం ఇదే. అయితే సినిమాను ఎక్కువ రేటుకు కొనుగోలు చేయడంతో లాభాల బాటలోకి వెళ్లాలంటే ఇంకా కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది.

    తొలి వారం వసూళ్లు ఎంతంటే?

    తొలి వారం వసూళ్లు ఎంతంటే?

    ‘సాహో' మూవీ తొలివారం వసూళ్లు పరిశీలిస్తే.... తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 73.97 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2 మూవీ తర్వాత అత్యధిక ఫస్ట్ వీక్ షేర్ సాధించిన సినిమాగా ‘సాహో' రికార్డులకెక్కింది.

    లాభాలు రావాలంటే...

    లాభాలు రావాలంటే...

    తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలకు కలిపి ‘సాహో' రైట్స్ రూ. 120 కోట్లకు మించిన ధరకు అమ్మారు. సినిమా లాభాల బాటలోకి వెళ్లాలంటే ఇంకా రూ. 50 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. కొన్ని ఏరియాల్లో నో రిటర్న్ అమౌంట్ బేసిస్‌లో రైట్స్ అమ్మారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు అంత మొత్తం వసూలు అవుతుందో లేదో అనే సందేహంలో ఉన్నారు.

    ఏరియా వైజ్ కలెక్షన్

    ఏరియా వైజ్ కలెక్షన్

    తొలివారం షేర్ నైజాం ఏరియాలో రూ. 26.10 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 10.75 కోట్లు, ఉత్రాంధ్రలో రూ. 8.92 కోట్లు, గుంటూరు రూ. 7.46 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 6.90 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 5. 20 కోట్లు, కృష్ణ రూ. 4.75 కోట్లు, నెల్లూరు రూ. 3.89 కోట్లు రాబట్టింది.

    సాహో

    సాహో

    వరల్డ్ వైడ్ వసూళ్లు పరిశీలిస్తే...ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే షేర్ ప్రకారం చూసుకుంటే సినిమా పెట్టుబడి తిరిగి రావాలంటే ఇంకా భారీ మొత్తం వసూలు కావాల్సి ఉంది. మరి ఫుల్‌రన్‌లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

    English summary
    Saaho First Week AP and TS Collections Report. The movie collected Rs. 73.97Cr in 7 days.Saaho written and directed by Sujeeth. It was produced by Vamsi Krishna Reddy, Pramod Uppalapati and Bhushan Kumar under their respective banners of UV Creations and T-Series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X