ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ వి ఎపిక్‌లో ‘సాహో’ సరికొత్త రికార్డ్
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 'వి ఎపిక్' మల్టీప్లెక్స్ ఇటీవల కొత్తగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్ థియేటర్లో ఆసియాలోనే అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రభాస్ స్నేహితుడు, యువి క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన వేమారెడ్డి వంశీకృష్ణరెడ్డి 'వి ఎపిక్' నిర్మాణంలో ప్రధాన భాగస్వామి. 'సాహో' మూవీతోనే ఈ థియేటర్ ప్రారంభమైంది.
ఈ థియేటర్ ఎఫెక్టుతో 'సాహో' మూవీ ఇక్కడ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సూళ్లూరుపేటలో బాహుబలి 2 మూవీ ఫుల్ రన్ గ్రాస్ రికార్డును 'సాహో' కేవలం 3 రోజుల్లోనే తుడిచేసింది. ఫస్ట్ డే రూ. 19.5 లక్షల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు కూడా ఇక్కడ అదే జోరు కొనసాగుతోంది. సోమవారం వరకు టిక్కెట్లన్నీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి.

సూళ్లురుపేట సమీంలోని టౌన్లు, గ్రామాల నుంచి 'వి ఎపిక్' థియేటర్లో అతిపెద్ద స్క్కీన్లో సాహో చూసేందుకు భారీగా జనం తరలి వస్తున్నారు. మొదటి రోజు ఈ థియేటర్లో సాహో టికెట్ రూ. 500కు అమ్మారు. రెండో రోజు నుంచి రూ. 200 రెగ్యులర్ రేటు కొనసాగుతోంది.
'సాహో' మూడు రోజుల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోవడంతో సూళ్లురు పేటలో రూ. 26 లక్షల గ్రాస్ వసూలైంది. ఈ మూవీ ఫుల్ రన్లో రూ. 50 లక్షల గ్రాస్ వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. 'సాహో' మూవీకి ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తుండటంతో 'సైరా' చిత్రాన్ని కూడా ఇక్కడ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో బిగ్ స్క్రీన్ సైజ్ 102.6 అడుగుల వెడల్పు, 56 అడుగుల ఎత్తుతో ఉంటుందట. ప్రపంచంలోని అతి పెద్ద సిల్వర్ స్క్రీన్స్‌లో ఇది థర్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‍గా చెప్పుకుంటున్నారు. ఆసియాలో ఇంత పెద్ద స్క్రీన్ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం మూడు స్క్రీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి అతిపెద్ద స్క్రీన్. ఇది 647 సీట్ల కెపాసిటీతో ఉంటుందని సమాచారం. మిగతా రెండు చిన్న స్క్రీన్లు 140 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











