సాహో మరో సంచలనం.. అక్కడ 100 కోట్లుకు చేరువగా.. మాస్ ఏరియాలో స్ట్రాంగ్‌గా
ప్రతికూల రివ్యూలను, నెగిటివ్ టాక్‌ను ఎదిరిస్తూ సాహో చిత్రం రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. హిందీ గడ్డపై ప్రభాస్ నటించిన ఈ చిత్రం వసూళ్ల జెండాను ఎగురవేస్తున్నది. సాహో చిత్రం రికార్డు కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతూ సరికొత్త చరిత్రను రాసేందుకు సిద్దమవుతున్నది. అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొంటూ సాహో చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువ కావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో హిందీ వెర్షన్‌లో ఎంత సాధించిందంటే..

రూ.100 కోట్లకు చేరువగా
సాహో రిలీజ్ తేదీ నుంచి వరుసగా మూడు రోజులు ధాటిగా కలెక్షన్లు సాధించింది. సెప్టెంబర్ 2న గణేష్ చతుర్థి పండుగ కావడంతో సినిమా వసూళ్లు 50 శాతం పడిపోయాయి. సోమవారం రూ.14.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాంతో నాలుగు రోజులు వసూళ్లు రూ.93.28 కోట్లుగా నమోదయ్యాయి. దాంతో ఈ చిత్రం రూ.100 కోట్లకు సమీపానికి చేరుకొన్నది. సెప్టెంబర్ 3 తేదీ ఆ ఘనతను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మాస్ ఏరియాలో స్ట్రాంగ్‌గా
సాహో కలెక్షన్లపై తరుణ్ ఆదర్శ్ స్పందించారు. సాహో చిత్రం నాలుగు రోజున భారీగా డబుల్ డిజిట్ వసూళ్లను సాధించింది. మాస్ సెంటర్లలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు వచ్చే కలెక్షన్లు కీలకంగా మారాయి. సాహో హిందీ వెర్షన్ శుక్రవారం రూ.24.40 కోట్లు, శనివారం రూ.25.20 కోట్లు, ఆదివారం రూ.29.48 కోట్లు, సోమవారం రూ.14.20 కోట్లు వసూలు చేసింది అని ట్వీట్ చేశారు.

రెండోసారి ప్రభాస్ ఘనత
సాహో రిలీజ్ తర్వాత సినీ విమర్శకులు పెదవి విరిచారు. స్క్రీన్ ప్లే సరిగా లేదంటూ, యాక్షన్ సీన్లలో లాజిక్ లేదంటూ విమర్శించారు. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపాయి. అయినప్పటీకీ. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టడం గమనార్హం. ఇక రెండోసారి వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక తెలుగు హీరోగా ప్రభాస్ ఓ ఘనతను సొంతం చేసుకోనున్నారు.

వివాదంలో సాహో మూవీ
ఇదిలా ఉండగా, సాహో చిత్రంపై హాలీవుడ్ డైరెక్టర్ జెరోమ్ సల్లె భగ్గుమన్నాడు. తన చిత్రం లార్గో వించ్ కథకు సాహో స్టోరి పోలి ఉంది. నా సినిమాను కాపీ కొట్టడం టాలీవుడ్‌లో ఇది రెండోసారి. నా కథను చౌర్యం చేసినా సరిగా తీయాలని తెలుగు డైరెక్టర్లకు చురకలంటించారు. దాంతో సినీ వర్గాల్లో ఈ సినిమాపై భారీ చర్చ జరిగింది.


Click it and Unblock the Notifications











