Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలీవుడ్లో సాహో సెన్సేషనల్ రికార్డు.. 500 కోట్ల క్లబ్ వైపు పరుగు
Recommended Video
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి టాక్ ఎలా ఉన్న వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. రిలీజైన తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను సంపాదించుకొన్న ఈ చిత్రం తొలి వారాంతంలో భారీగా కలెక్షన్లు సాధించి రికార్డులను నెలకొల్పింది. తొలి వారాంతం తర్వాత హిందీ వెర్షన్ మినహాయిస్తే.. మిగితా భాషల్లో కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాహో చిత్రం వాటిని ఎదిరించుకొంటూ రూ.500 క్లబ్‌వైపు పరుగులు పెడుతున్నది. గత 12 రోజుల్లో ఈ చిత్రం ఎంత మేరకు వసూళ్లను సాధించిందంటే..
రూ.455 కోట్ల గ్రాస్
సాహో మూవీ గత 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్ల నికరంగా, రూ.455 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. హిందీలో ఈ చిత్రం రూ.135 కోట్లు వసూలు చేసింది. ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల్లో వసూళ్లు ఇంకా బలంగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజున రూ.1 కోటి, హిందీలో రూ.1 కోటి, కర్ణాటక రూ.30 లక్షలు, తమిళనాడు రూ.40 లక్షలు, కేరళలో రూ.10 లక్షలతో దేశవ్యాప్తంగా రూ.2.8 కోట్ల నికర వసూళ్లను సాధించింది.
బాలీవుడ్లో 2019 హయ్యెస్ట్
బాలీవుడ్లో సాహో చిత్రం 2019లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం గల్లీబాయ్ లైఫ్ టైమ్ వసూళ్లను, కబీర్ సింగ్, యూరీ, మిషన్ మంగళ్, భారత్, కేసరి, టోటల్ ఢమాల్, సూపర్ 30 చిత్రాల వసూళ్లను అధిగమించింది.
తెలుగు రాష్ట్రాల్లో
గత 12 రోజుల్లో సాహో కలెక్షన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.29.05 కోట్లు, సీడెడ్‌లో రూ.11.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.9.84 కోట్లు, తూర్పు గోదావరి జిలాల్లో రూ.7.10 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5.79 కోట్లు, గుంటూరులో రూ.7.82 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.5.16 కోట్లు, నెల్లూరులో రూ.4.25 కోట్ల వసూళ్లతో మొత్తంగా రూ.80.56 కోట్ల షేర్ సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లోగత 12 రోజుల్లో సాహో కలెక్షన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.29.05 కోట్లు, సీడెడ్‌లో రూ.11.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.9.84 కోట్లు, తూర్పు గోదావరి జిలాల్లో రూ.7.10 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5.79 కోట్లు, గుంటూరులో రూ.7.82 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.5.16 కోట్లు, నెల్లూరులో రూ.4.25 కోట్ల వసూళ్లతో మొత్తంగా రూ.80.56 కోట్ల షేర్ సాధించింది.
కర్ణాటక, ఓవర్సీస్లో
ఇక తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటకలో ఈ చిత్రం రూ.15.84 కోట్లు, తమిళనాడులో రూ.517 కోట్లు, కేరళలో రూ.1.40 కోట్లు సాధించింది. అమెరికా కెనడాలో రూ.12.80 కోట్లు, మిగితా దేశాల్లో రూ.16.90 కోట్ల వసూళ్లను సాధించింది.