twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో మరో రికార్డు.. రూ.500 కోట్లకు చేరువగా.. మూడోవారంలో కూడా కలెక్షన్ల ధమాకా!

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం మూడో వారంలోకి ప్రవేశించి నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. కొత్త చిత్రాలకు ధీటుగా కలెక్షన్లు సాధిస్తున్నది. మూడో వారంలో వసూళ్లు తగ్గకపోవడమే కాకుండా పుంజుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నెగిటివ్ టాక్‌లో కూడా సాహో కలెక్షన్లు పెరగడానికి కారణమేమిటంటే..

    మూడోవారంలో పెరగడానికి కారణం

    మూడోవారంలో పెరగడానికి కారణం

    ఇక మూడో వారంలోకి సాహో ప్రవేశించగానే వసూళ్లు పుంజుకొన్నాయి. అందుకు కారణం రెండో వారం వరకు ఉన్న అధిక టికెట్ రేట్లను తగ్గించడంతో కొన్ని వర్గాలు ఈ సినిమాను చూడటానికి ఆసక్తి పడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో వారం కంటే మూడో వారం వసూళ్లు బాగా పెరిగాయి. మున్ముందు ఇలానే నిలకడగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    Recommended Video

    Saaho Box Office Collection Day 12
     సాహో 16వ రోజు కలెక్షన్లు

    సాహో 16వ రోజు కలెక్షన్లు

    సాహో 16వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 8 లక్షలు రూపాయలు, సీడెడ్‌లో రూ.4 లక్షలు, తూర్పు గోదావరిలో రూ. 3.4 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.3 లక్షలు, గుంటూరులో 3.1 లక్షలు సాధించాయి. కృష్ణ జిల్లాలో 2 లక్షలు, నెల్లూరులో 2 లక్షల షేర్‌ను సాధించి.. మొత్తంగా 30.5 లక్షల రూపాయలు వసూలు చేసింది.

    మొత్తం 16 రోజుల వసూళ్లు

    మొత్తం 16 రోజుల వసూళ్లు

    తెలుగు రాష్ట్రాల్లో సాహో మొత్తంగా రూ.81.46 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో రూ.29.42 కోట్లు, సీడెడ్‌లో రూ.11.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.9.99 కోట్లు వసూలు చేసింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రూ.5.87 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5.87 కోట్లు, గుంటూరులో రూ.7.90 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.5.22 కోట్లు, నెల్లూరులో రూ.4.36 కోట్లు సాధించింది.

    దేశవ్యాప్తంగా వసూళ్లు

    దేశవ్యాప్తంగా వసూళ్లు

    ఇక తెలుగేతర రాష్ట్రాల్లో తమిళంలో రూ.5.22 కోట్లు, కేరళలో రూ.1.41 కోట్లు వసూలు చేసింది. ఇక ఉత్తరాది, హిందీ భాషల్లో రూ.79.29 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఓవర్సీస్ విషయానికి వస్తే అమెరికా, కెనడాలో రూ.13.14 కోట్లు, మిగితా దేశాల్లో రూ.17.29 కోట్లు వసూలు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ఇక ప్రపంచవాప్తంగా సాహో చిత్రం భారీగానే వసూళ్లు రాబడుతున్నది. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. ఈ చిత్రం 14 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.424 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. మూడో వారం ముగిసే సమయానికి ఈ సినిమా రూ.500 కోట్లలో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    English summary
    After Bahubali the face of Telugu Cinema among all its linguistic counterparts in India has changed. It is not even exaggeration in saying Bahubali became the face of Indian Cinema in the world. Makers are now investing more time and money in Telugu cinema than they used to spend before Bahubali series smashed all the Indian box office records. This movie is racing towards Rs.500 crores club.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X