twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో 25 రోజుల కలెక్షన్స్: ఫ్లాప్ టాక్‌కే ఈ రేంజ్.. ఏ మేరకు నష్టం అంటే

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే ఎన్నడూ లేని హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే సినీ విమర్శకులు పెదవి విరిచినా కలెక్షన్లను కొల్లగొట్టడంలో ఎలాంటి జంకు ప్రదర్శించలేదు. సాహో ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు వారాలు పూర్తి కానున్నది. ఈ క్రమంలో గత 25 రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..

     తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    సాహో చిత్రం గత నాలుగు వారాల్లో ఓ మోస్తారు కలెక్షన్లు సాధించింది. నైజాంలో సుమారు 30 కోట్ల షేర్, సీడెడ్‌లో 12 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో సుమారు 11 కోట్ల షేర్ సాధించింది. ఇక ఆంధ్రాలోని తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు, గుంటూరులో రూ.8 కోట్లు సాధించింది. అలాగే కృష్ణా జిల్లాలో రూ.5.5 కోట్లు, నెల్లూరులో రూ.4.5 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 84 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    దక్షిణాదిలో వసూళ్లు

    దక్షిణాదిలో వసూళ్లు

    ఇక దక్షిణాది వ్యాప్తంగా సాహో రిలీజైంది. అనూహ్యమైన ప్రమోషన్ కార్యక్రమాల ప్రభావంతో ఓపెనింగ్స్ కనిపించినా వాటిని నిలబెట్టుకోలేకపోయింది. కర్ణాటకలో ఈ చిత్రం రూ.16.5 కోట్లు, తమిళంలో రూ.5.50 కోట్లు, కేరళలోరూ.1.50 కోట్లు సాధించింది. దాదాపు ఈ రాష్ట్రాల్లో డిస్టిబ్యూటర్లకు భారీగానే నష్టం వాటిల్లిందనే విషయం ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

     హిందీ రాష్ట్రాల్లో

    హిందీ రాష్ట్రాల్లో

    సాహో చిత్రాన్ని గణనీయంగా ఆదరించింది హిందీ ప్రేక్షకులే. బీహార్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాలాయి. హిందీలో సుమారు రూ.100 కోట్లకుపైగా వసూలు సాధించింది.

    ఓవర్సీస్‌లో

    ఓవర్సీస్‌లో

    ఇక ఓవర్సీస్‌లో విషయానికి వస్తే, అమెరికాలో రూ.14 కోట్లు, మిగితా దేశాల్లో రూ.18 కోట్లు వసూలు చేసి ప్రభాస్ స్టామినాను ప్రూవ్ చేసింది. ఇలా మొత్తంగా సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ రిపోర్టు వెల్లడిస్తున్నది. ఈ సినిమా బిజినెస్ దాదాపు 270 కోట్ల మేర జరిగింది.

     మొత్తంగా ఎంత నష్టమంటే

    మొత్తంగా ఎంత నష్టమంటే

    అంటే సాహో సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.50 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్లాప్ టాక్ వస్తేనే ప్రభాస్ మూవీ కలెక్షన్లు ఇలా ఉంటే.. హిట్ టాక్ వచ్చి ఉంటే సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటో ఊహించిన విధంగా ఉండేదనే మాట వినిపిస్తున్నది.

    English summary
    After Bahubali, Saaho became the face of Indian Cinema in the world. This movie collected nearly 500 crores gross in 25 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X