‘సాహో’ 4 డేస్ ఏపీ, తెలంగాణ కలెక్షన్... అసలు పరీక్ష నేటి నుంచే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సాహో'. యూవి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్‌తో భారీగా నిర్మించింది. ఆగస్టు 30న విడుదలైన ఈచిత్రంపై రిలీజ్ ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రిలీజ్ తర్వాత ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త వెనకబడింది. అయితే గడిచిన తొలి 4 రోజుల్లో కలెక్షన్ల పరంగా ఈ చిత్రం డీసెంట్ అని చెప్పక తప్పదు. వీకెండ్‍తో పాటు వినాయక చవితి సెలవు కలిసి రావడం మరింత ప్లస్సయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

నేటి నుంచే అసలు పరీక్ష
‘సాహో' చిత్రానికి అసలు పరీక్ష నేటి నుంచి మొదలు కానుంది. సినిమాకు మిక్డ్స్ టాక్ రావడం, వీక్ డేస్ కావడంతో వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే కలెక్షన్ బట్టే సినిమాపై జనం మూడ్ ఎలా ఉంది అనే విషయంలో ఒక అంచనాకు రావడానికి వీలుంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల కలెక్షన్
తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో' తొలి 4 రోజుల్లో రూ. 67.39 కోట్ల షేర్ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో దాదాపు సగం మేర రాబట్టినట్లు స్పష్టమవుతోంది. ఫస్ట్ వీక్ వసూళ్లు బావున్నాయి. సెకండ్ వీక్ వచ్చే షేర్ ఆధారంగా లాభ నష్టాలపై ఓ అంచనాకు రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది?
తొలి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పరిశీలిస్తే... నైజాం రూ. 23.30 కోట్లు, సీడెడ్ రూ. 9.60 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 8 కోట్లు, గుంటూరు రూ. 7.10 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 6.40 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 4.90 కోట్లు, కృష్ణ రూ. 4.50 కోట్లు, నెల్లూరు రూ. 3.59 కోట్లు వసూలు చేసింది.

లాభాలు రావాలంటే?
నైజాం రైట్స్ రూ. 40 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ. 25 కోట్లు, ఉత్తరాంధ్ర రైట్స్ రూ. 15 కోట్లు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కలిపి రూ. 18 కోట్లకు, గుంటూరు-కృష్ణ-నెల్లూరు కలిపి రూ. 24 కోట్లకు అమ్మారు. లాభాలు రావాలంటే నైజాంలో రూ. 17 కోట్లకుపైగా, సీడెడ్లో రూ. 15 కోట్లకుపైగా, ఉత్తరాంధ్రలో రూ. 7 కోట్లకుపైగా, ఈస్ట్-వెస్ట్‍లో రూ. 7 కోట్లకుపైగా, , గుంటూరు-కృష్ణ-నెల్లూరులో మరో రూ. 9 కోట్లకుపైగా షేర్ వసూలు కావాల్సి ఉంది.

‘సాహో'పై టాక్ మారింది
సినిమా విడుదలైన రోజు చాలా వరకు మిక్డ్స్ రివ్యూలు రావడంతో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అయితే ఫస్ట్ వీకెండ్ గిడిచిన తర్వాత సగటు ప్రేక్షకుడి నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కాస్త పాజిటివ్‌గా ఉంది. మరి మారిన మౌత్ టాక్ సినిమాను ఏమేరకు సేవ్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











