రాజధానిలో సాహో టికెట్ ధర తెలిస్తే షాకే.. ప్రభాస్ క్రేజంటే అది.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే
భారీ అంచనాలతో సాహో మూవీ ఓవర్సీస్‌లో రిలీజ్‌కు ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాపై అటు పాజిటివ్, ఇటు నెగిటివ్ టాక్‌తో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండటం వల్ల డిస్టిబ్యూటర్లు, నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచుకొనేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సినిమా టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం జరిగిందనే మాట వినిపిస్తున్నది. అయితే ఈ సినిమా టికెట్ రేట్లు మార్కెట్లో మండిపోతున్నాయి. ఈ సినిమా టికెట్ ధర ఎంత పలికిందంటే..

భారీగా అడ్వాన్స్ బుకింగ్
సాహో సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ పాజిటివ్ నోట్‌తో మొదలైంది. హిందీ వెర్షన్‌లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో గురువారం నాటికి రూు.10 కోట్ల మేర వసూళ్లు నమోదయ్యాయి. పాజిటివ్ టాక్ కారణంతో అడ్వాన్స్ బుకింగ్, కరెంట్ బుకింగ్ భారీగా పెరిగే అవకాశం ఉందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

ఢిల్లీలో మండిపోతున్న టికెట్ రేటు
సాహోపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను బట్టి థియేటర్లు దండిగా టికెట్ రేట్లను పెంచాయి. దేశ రాజధానిలో అధికారికంగా రికార్డు స్థాయిలో టికెట్ రేటును పెంచేశాడు. ఓ ప్రీమియర్ థియేటర్‌లో టికెట్ ఒక్కంటికి రూ.2200 ధరగా నిర్ణయించడం సాహో క్రేజ్ ఏంటో అర్ధమవుతున్నది.

దేశవ్యాప్తంగా వసూళ్లు
సాహో మొదటి రోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. ప్రభాస్ కెరీర్‌లోనే రెండో అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రం సుమారు రూ.75 నుంచి రూ.80 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టే అవకాశం కనిపిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
ఇక తెలుగు రాష్ట్రాల్లో కనివినీ ఎరుగని విధంగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపి తొలి రోజున రూ.35 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నైజాంలో భారీగా వసూళ్లు నమోదు అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.

తమిళ, మలయాళ, కన్నడలో
ఇక తమిళ, మలయాళంలో కూడా రికార్డు కలెక్షన్లు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. తొలి రోజున తమిళంలో రూ.15 కోట్లు, మలయాళంలో రూ.5 కోట్లు వరకు వసూళ్లు సాధించడానికి అవకాశం ఉంది. కన్నడలో కూడా అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరగడంతో సాహోకు మంచి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











