నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన సాహో.. మహర్షి, స్పైడర్, అజ్ఞాతవాసి రికార్డులు బ్రేక్

Recommended Video

Saaho Box Office Collection Day 1 || Prabhas || Sujeeth || Filmibeat Telugu

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రం అన్ని రకాల ప్రతికూలతను అధిగమిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ వర్షం కురుస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సాహో కలెక్షన్ల ప్రభంజనం కురిపిస్తున్నది. ఇక ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తొలిరోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

 ఉత్తరాదిలో ప్రింట్లు అందకపోవడంతో

ఉత్తరాదిలో ప్రింట్లు అందకపోవడంతో

ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా, సుజిత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సాహో చిత్రంపై సినీ విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరిచారు. దాంతో తొలి ఆట నుంచే సాహో చిత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది. అయినా సాహో చిత్రం మధ్యాహ్నం షో నుంచి ఫస్ట్, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ రేట్‌ను పెంచుకొంటూ పోయింది. దాంతో దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదయ్యాయి. కొన్ని చోట్ల ప్రింట్లు అందకపోవడం వల్ల వసూళ్లపై ప్రభావం పడిందనే మాట వినిపిస్తున్నది.

హిందీలో రికార్డు కలెక్షన్లు

హిందీలో రికార్డు కలెక్షన్లు

సాహో హిందీ వెర్షన్‌కు భారీగా స్పందన వ్యక్తమైంది. ముంబై, గుజరాత్, మరట్వాడా ప్రాంతాల్లో ఈ చిత్రానికి అనూహ్య స్పందన కనిపిస్తున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు రూ.25 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసింది. నాన్ హాలీడే రోజున సాహో చిత్రం ఈ రేంజ్‌లో వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు 2 వేల చోట్ల ప్రింట్స్ అందకపోవడం, ఉత్తరాదిలోని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రింట్స్ సమస్య తలెత్తడం వసూళ్లలో తగ్గుదల కనిపించదనే మాట వినిపిస్తున్నది.

 చెన్నైలో రికార్డుల మోత

చెన్నైలో రికార్డుల మోత

దక్షిణాదిలో కూడా సాహో చిత్రానికి మంచి స్పందన కనిపిస్తున్నది. తొలి రోజున చెన్నైలో భారీగా కలెక్షన్లను సాధించింది. తమిళ వెర్షన్‌లో ఈ చిత్రం 32 లక్షల రూపాయలు వసూలు చేసింది, హిందీ, తెలుగు, తమిళంలో కలిపి చెన్నైలో రూ.73 లక్షల వసూళ్లను సాధించడం రికార్డుగా చెప్పుకొంటున్నారు. చెన్నై లోకల్‌లో సాహో చిత్రం భరత్ అనే నేను (27 లక్షలు) కలెక్షన్లను అధిగమించింది. అంతేకాకుండా మూడు భాషల్లో స్పైడర్ (65 లక్షలు) ను వసూళ్లను కూడా దాటేసింది.

ఓవర్సీస్‌లో నాన్ బహుబలి రికార్డులు

ఓవర్సీస్‌లో నాన్ బహుబలి రికార్డులు

ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే, యూఎస్‌లో సాహో చిత్రం రికార్డు వసూళ్లను సాధించింది. తొలిరోజు 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. ఇక ఆస్ట్రేలియాలో మహర్షి రికార్డులను కూడా అధిగమించింది. అన్ని భాషల్లో మహర్షి 322K సాధిస్తే.. సాహో రూ.350K మేర వసూలు చేయడం విశేషంగా పేర్కొంటున్నారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో

ఇక నైజాంలో సినిమా స్టామినాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సాహో నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది. తొలి రోజున బాహుబలి చిత్రం రూ.36,09,236 వసూలు చేస్తే, సాహో చిత్రం రూ. 34,29,293 కలెక్ట్ చేసింది. అజ్ఞాతవాసి | చిత్రం 28,96,772. మహర్షి చిత్రం రూ.28,78,265 వసూలు చేసిన సంగతి తెలిసిందే.

 తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

ఇక తెలుగు రాష్ట్రాల్లో సాహో చిత్రం తొలి రోజున భారీగానే వసూళ్లను సాధించినట్టు తెలుస్తున్నది. పలు ప్రాంతాల్లోని వెలుగులోకి వచ్చిన వసూళ్లతో అంచనాతో ఈ చిత్రం సుమారు రూ.25 కోట్ల మేర వసూలు చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వసూళ్లు ఇంకా అందాల్సి ఉంది. వారాంతంలో సాహో చిత్రం వసూళ్లు పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X