బాహుబలి రికార్డు బ్రేక్.. సాహోకు తొలి రోజే రూ.100 కోట్లు..
బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా ఇమేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రం తొలిరోజు ప్రభంజనమే సృష్టించింది. తొలిరోజు ఈ చిత్రం రూ.100 కోట్లు సాధించి ట్రేడ్ వర్గాలను, సినీ విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్, అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లను నమోదు చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ఏపీ, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల్లో సాహో వసూళ్లు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రాలో సాహో కలెక్షన్లు
ఆంధ్రాలో సాహో భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. జిల్లాలు, ప్రాంతాల వారీగా పరిశీలిస్తే బాహుబలి రేంజ్‌లో కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. గుంటూరులో రూ.4.7 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.2.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.77 కోట్లు, తూర్పు రూ.4.45 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.3.6 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.2.56 కోట్లు వసూలు చేసింది. నెల్లూరులో బాహుబలి 2.1 కోట్లు వసూలు చేసింది.

నైజాం, సీడెడ్‌లో సాహో వసూళ్లు
ఇక నైజాం, సీడెడ్‌లో కూడా సాహో వసూళ్లు కుంభవృష్టి తొలిరోజు సాగింది. తొలిరోజు సాహో నైజాంలో రూ.9.41 కోట్లు, సీడెడ్‌లో రూ.4.7 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ వసూళ్లు నాన్ బాహుబలి రికార్డుగా పేర్కొంటున్నారు. బాహుబలి2 నైజాంలో తొలిరోజు రూ.8.9 కోట్లు సాధించింది. ఇక పలు ప్రాంతాల్లో ఈ చిత్రం భారీగా కలెక్షన్లు రాబడుతున్నది.

తరుణ్ ఆదర్శ్ ఆశ్చర్యం
సాహో చిత్రానికి బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి ప్రముఖ ట్రేడ్ అనలిస్టు, క్రిటిక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సాహో చిత్రం తొలి రోజు అద్భుతమైన వసూళ్లను సాధించింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ స్టార్‌డమ్ మంచి హైప్ తీసుకొచ్చింది. భారీగా అడ్వాన్స్ బుకింగ్ కావడం సినిమాకు కలిసి వచ్చింది. రెండో రోజు, మూడో రోజు ఈ సినిమా భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. హిందీ వెర్షన్ రూ.24.40 కోట్లు వసూలు చేసింది అని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

రిలీజ్ స్ట్రాటెజీ వర్కవుట్
సాహో విజన్, లక్ష్యం నెరవేరినట్టే కనిపిస్తున్నది. ప్యాన్ ఇండియా మూవీకి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన యాక్షన్ ఫిలిం సినిమాకు కలిసి వచ్చింది. నిర్మాతల రిలీజ్ స్ట్రాటెజీ కూడా సినిమాకు అదనపు బలంగా మారింది. తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











