రెండో రోజు సాహో సెన్సేషన్.. బాహుబలి 2 తర్వాత మళ్లీ ఈ సినిమానే!
ప్రభాస్ హీరోగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మూవీ సాహో. విడుదలకు ముందు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా విడుదలయ్యాక మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సాహోలో భారీ తారాగణం, యాక్షన్ సీన్స్ ఆశించిన మేర ఫలితం రాబట్టలేక పోయాయి. అయనప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మంచి జోష్‌లో ఉంది.
మౌత్ టాక్, రివ్యూస్ ఎఫెక్ట్ సాహోపై పడినట్లుగా అనిపించడంలేదు. శుక్రవారం మొదటి షో మొదలుకొని నేటివరకు థియేటర్స్ కళకళలాడుతూనే ఉన్నాయి. దీంతో సాహో మూవీ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా అందిన సమాచారం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి రెండో రోజు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ 10 కోట్లు దాటిందని తెలిసింది. 'బాహుబలి 2' మినహాహిస్తే ఇప్పటిదాకా మరే సినిమా ఈ ఫీట్ సాధించకపోవడం విశేషం. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది సాహో.

ఇక సాహో సినిమా విశేషాలు చూస్తే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











