twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ ప్రీమియర్ షో కలెక్షన్స్... ఇంతకీ రికార్డులు బద్దలుకొట్టిందా?

    |

    ప్రభాస్ హీరోగా రూపొందిన 'సాహో' మూవీపై రిలీజ్ ముందు నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు 'బాహుబలి 2'ను మించిన బడ్జెట్ కావడంతో సాధారణంగానే వసూళ్లు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంటుంది.

    తెలుగు సినిమాలు ముందుగా రిలీజ్ అయ్యేది యూఎస్ఏలోనే... ప్రీమియర్ షో పేరుతో ఒకరోజు ముందుగానే అక్కడ ప్రదర్శితం అయ్యే షోలకు మంచి డిమాండ్ ఉంటుంది. మరి 'సాహో' ప్రీమియర్ షోల ద్వారా ఎంత వసూలు చేసింది? ప్రభాస్ గత చిత్రం బాహుబలి 2 స్థాయిని అందుకుందా? ఇతర సినిమాల రికార్డులను బద్దలు కొట్టిందా? ఓ లుక్కేద్దాం...

    యూఎస్ఏలో భారీ రిలీజ్

    యూఎస్ఏలో భారీ రిలీజ్

    యూఎస్ఏలో ‘సాహో' చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు అత్యధిక స్క్రీన్లలో విడుదల చేశారు. ప్రీమియర్ షోలు కూడా రికార్డు స్థాయిలో వేశారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం $820,000 వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ కలెక్షన్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. బహుషా 1 మిలియన్ మార్క్ అందుకునే అవకాశం ఉంది.

    మహర్షి రికార్డ్ బద్దలు

    మహర్షి రికార్డ్ బద్దలు

    2019 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో మహర్షి $511,000 యూఎస్ఏ ప్రీమియర్ షో వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే $820,000 రాబట్టడం ద్వారా ‘సాహో' మూవీ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. అయితే ఇది ప్రభాస్ కెరీర్లో హయ్యెస్ట్ ప్రీమియర్ షో వసూళ్లు అయితే కాదు.

    బాహుబలి 2 రికార్డ్ రీచ్ కాలేక పోయింది

    బాహుబలి 2 రికార్డ్ రీచ్ కాలేక పోయింది

    ప్రభాస్ గత చిత్రం ‘బాహుబలి 2' రికార్డును అధిగమించడంలో ‘సాహో' విఫలమైంది. ‘బాహుబలి 2' ప్రీమియర్స్, ఫస్ట్ డే వసూళ్లతో కలిపి 4.5. మిలియన్ డాలర్లు రాబట్టింది. అయితే ‘సాహో' దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. జోనర్స్ పరంగా రెండూ భిన్నమైన చిత్రాలు కాబట్టి కంపేర్ చేయలేం. ఏ జోనర్ అయినా చివరకు మాట్లాడుకునేది వసూళ్ల గురించే అనేది వాస్తవం.

    ఆల్ టైమ్ టాప్ 10లో ‘సాహో' స్థానం ఎంత?

    ఆల్ టైమ్ టాప్ 10లో ‘సాహో' స్థానం ఎంత?

    ఆల్ టైమ్ యూఎస్ఏ ప్రీమియర్ షో హయ్యెస్ట్ వసూళ్లు పరిశీలిస్తే ‘సాహో' 6వ స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. బాహుబలి, అజ్ఞాతవాసి, ఖైదీ నెం.150, స్పైడర్ తర్వాతి స్థానాల్లో ‘సాహో' ఉన్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ వివరాలు వెల్లడించాల్సి ఉంది.

    English summary
    Saaho has collected $820,000 at the USA box office in the premiere shows on Thursday and it might cross $1 million mark, when the final figures are revealed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X