twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Saaho క్లోజింగ్ కలెక్షన్స్: పవన్ కళ్యాణ్ తర్వాత ప్రభాస్! మిగిలింది భారీ నష్టాలే

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసినప్పటికీ కలెక్షన్ల విషయానికి వచ్చే సరికి ఆ స్థాయిలో లేకపోవడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరిగింది. అయితే, ఆ స్థాయిలో మాత్రం వసూళ్లు రాబట్టడంలో సాహో విఫలమైందనే చెప్పుకోవాలి.

    పవన్ తర్వాత ప్రభాసే..

    పవన్ తర్వాత ప్రభాసే..

    హిందీ వర్షన్ ఎలా ఉన్నా.. తెలుగులో మాత్రం ‘సాహో'ఆశించిన స్తాయిలో కలెక్షన్లు రాలేదనేది వాస్తవం. తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్.. కలెక్షన్లను పోల్చి చూస్తే మాత్రం సాహో భారీ నష్టాన్నే మిగిల్చిందని చెప్పవచ్చు. అజ్ఞాత వాసి తర్వాత డిసాస్టర్ జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది సాహో.

    భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ..

    భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ..

    సాహో ప్రీరిలీజ్ బిజినెస్ సుమారు రూ. 160 కోట్లకుపైగా అయ్యింది. అయితే, సాహో తెలుగు వర్షన్ క్లోజింగ్ కలెక్షన్లు మాత్రం రూ. 106.31కోట్లుగా నమోదైంది. దీంతో సుమారు రూ. 50 కోట్లకుపైగా నష్టాలు మిగిల్చినట్లు తెలుస్తోంది.

    ప్రాంతాల వారీగా..

    ప్రాంతాల వారీగా..

    ప్రాంతాలవారీగా సాహో తెలుగు ప్రీ బిజినెస్ గమనించినట్లయితే.. నిజాం, యూఏ రూ. 46కోట్లు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు రూ. 19.5కోట్లు. ఏపీ, తెలంగాణ గాక మిగిలిన ప్రాంతాల్లో రూ. 50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 43కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

    క్లోజింగ్ కలెక్షన్లు ఇలా..

    క్లోజింగ్ కలెక్షన్లు ఇలా..

    ఇక సాహో క్లోజింగ్ కలెక్షన్లను గమనించినట్లయితే.. నిజాంలో రూ. 27.9కోట్లు, సీడెడ్ రూ. 11.4కోట్లు, యూఏ 10.06కోట్లు, తూర్పుగోదావరి రూ. 7.08కోట్లు, పశ్చిమగోదావరి రూ. 5.58కోట్లు, గుంటూరు రూ. 7.92 కోట్లు, కృష్ణా రూ. 5.12కోట్లు, నెల్లూరు రూ. 4.35కోట్లు, ఏపీ, టీఎస్ మొత్తం 79.41కోట్లు, ఓవర్సీస్ 14.6కోట్లు మొత్తం కలెక్షన్లు వచ్చేసరికి 106.31కోట్లుగా ఉంది.

    రూ. 50కోట్లకు పైగా..

    రూ. 50కోట్లకు పైగా..

    ప్రీ బిజెన్స్ దాదాపు 160 కోట్లు ఉండగా.. కలెక్షన్లు మాత్రం 106.31కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే దాదాపు 50కోట్లకుపైగా సాహో నష్టాలే మిగిల్చినట్లు తెలుస్తోంది. తెలుగు వర్షన్ ఎలా వున్నా... టాక్‌తో సంబంధం లేకుండా హిందీ వర్షన్ మాత్రం మంచి కలెక్షన్లనే రాబట్టిందని చెప్పుకోవచ్చు.

    English summary
    Saaho worldwide closing collections not beats it's pre release business.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X