Sachein Re Release Collections: రికార్డుల తిరగరాస్తున్న సచిన్.. బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన విజయ్ మూవీ
దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వీ క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మాణ సారథ్యంలో జాన్ మహేంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సచిన్. సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్, జెనిలీయా, బిపాస బసు జంటగా నటించిన ఈ చిత్రం 2005 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా సుమారు 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేసేందుకు సిద్దం చేశారు. అయితే ఇటీవల మొదలైన రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు, అలాగే సాధిస్తున్న సంచలనాల వివరాల్లోకి వెళితే..
సచిన్ సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జీవా సినిమాటోగ్రఫి, వీటీ విజయన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో రఘువరన్, వడివేలు, సంతానం, రష్మీ మురళి తదితరులు నటించారు. ఈ సినిమాను సుమారుగా 8 కోట్ల రూపాయలతో రూపొందించగా, ఈ మూవీ అప్పట్లో 10 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.

తమిళ రాజకీయాల్లోకి విజయ్ ప్రవేశించిన నేపథ్యంలో ఆయన నటించిన సినిమాలను రీ రిలీజ్ చేసి అభిమానులకు ఆనందాన్ని పంచే పనిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు సిద్దం చేశారు. ఫ్రాన్స్, అమెరికా, మలేషియా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.
సచిన్ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ బుక్ మై షోలో ఒపెన్ కాగా, అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఇప్పటికే 1.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఈ టికెట్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే సింగిల్ థియేటరల్ు, మల్టీప్లెక్స్‌లు అనే తేడా లేకుండా భారీగా టికెట్లు అమ్ముడు పోతున్నాయి.
సచిన్ సినిమాకు కనిపిస్తున్న ఊపుపై డిస్టిబ్యూటర్లు, చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో జెనిలీయా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంపై ట్వీట్లు చేసి సంతోషాన్ని పంచుకొన్నారు. ఈ సినిమా ఇప్పటికే 7 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ నాటికి లైఫ్ టైమ్ కలెక్షన్లు 10 కోట్లను దాటడమే కాకుండా గిల్లీ రీ రికార్డు వసూళ్లను అధిగమిస్తుందని పేర్కొంటున్నారు.
సౌత్ ఇండియాలో రీ రిలీజ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. గిల్లీ అత్యధికంగా 10.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ 8 కోట్ల రూపాయలు, బిజినెస్‌మ్యాన్ 5.3 కోట్లు, సింహాద్రి 5.14 కోట్లు, కుషి 4.15 కోట్లు, జల్సా 3.2 కోట్ల రూపాయలు వసూలుచేసింది. అయితే ఇప్పటి వరకు సచిన్ సినిమా గిల్లీ తప్ప అన్ని సినిమా కలెక్షన్ల రికార్డులు దాదాపు తుడిచి పెట్టేసింది అని ట్రడే్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











