800 పాన్ ఇండియా మూవీ కోసం సచిన్ టెండూల్కర్.. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కోసం గాడ్ ఆఫ్ క్రికెట్

క్రికెట్ మైదానంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌ను బెంబేలెత్తించిన అరవీర బౌలర్ ముత్తయ్య మురళీధరన్ మరోసారి రంగంలోకి దిగనున్నారు. ఈ సారి ఆయన రూపం వెండితెర మీద ఆవిష్కరించబోతున్నది. టెస్ట్ క్రికెట్ రంగంలో 800 వికెట్లు తీసుకొన్న ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా 800 టైటిల్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాకు ప్రమోషనల్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

శ్రీలంక లెగ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాను ఎంఎస్ శ్రీపతి తెరకెక్కిస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్ పాత్రను స్లమ్ డాగ్ మిలియనర్‌ ఫేమ్ మధుర్ మిట్టల్, ఆయన భార్య పాత్రను ముధిమలార్ రామస్వామి పోషిస్తున్నారు. ఈ సినిమాకు బుకర్ ప్రైజ్ విన్నర్ స్నేహన్ కరుణాతిలక రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Sachin Tendulkar

800 సినిమా ఈవెంట్‌ను ముంబైలో భారీగా నిర్వహించేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 5న జరిగే ఈ వేడుకకు సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి సచిన్ టెండూల్కర్ ఎన్నో మ్యాచులు ఆడారు. తన స్నేహితుడి జీవితంపై వస్తున్న సినిమా కోసం సచిన్ రావడానికి సంసిద్దతను వ్యక్తం చేశారు.

ప్రతిష్టాత్మకంగా రూపొందిన 800 సినిమాను ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ పాన్ ఇండియా డిస్టిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకొన్నాడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను తమిళం భాషలో నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ జోరుగా నిర్వహించేందుకు ప్లాన్ చేయనున్నారు.

Sachin Tendulkar

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ లాంటి క్రీడాకారుడి జీవితాన్ని తెరపైకి తీసుకు రావడం ఛాలెంజింగ్ టాస్క్. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. వాటన్నింటిని ఎదుర్కొని ఈ సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు సిద్దమయ్యారు. 800 వికెట్ల తీసుకొని చరిత్ర సృష్టించినందున్న ఈ సినిమాకు 800 అని టైటిల్ పెట్టడం కరెక్ట్ అనిపించింది. మురళీధరన్ బాల్యం నుంచి లెజెండరీ క్రికెటర్‌గా ఎదిగిన ప్రయాణం వరకు సినిమాలో చూపించబోతున్నాం అని అన్నారు.

నటీనటులు: మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్, నాజర్, వెల్ రామ్మూర్తి, రిత్విక, అరుల్ దాస్, హరికృష్ణన్, శరత్ లోహియా తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
మ్యూజిక్: జిబ్రాన్
రచన, దర్శకత్వం: ఎంఎస్ శ్రీపతి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X