షాదీ ముబారక్ కలెక్షన్లు.. సాగర్ ఆర్కే నాయుడు‌పై తరగని ప్రేక్షకుల ఆదరణ!

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత వారం అంటూ మార్చి 5వ తేదీన దాదాపు 10 సినిమాలకుపైగానే విడుదల కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వారం బుల్లితెర మెగాస్టార్‌గా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకొన్న సాగర్ ఆర్కే నాయుడు, దృశ్య రఘునాథ్ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరిష్ నిర్మించిన చిత్రం షాదీ ముబారక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన షాదీ ముబారక్ చిత్రంలో సాగర్ ఆర్కే నాయుడు నటనపై మరోసారి ప్రేక్షకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. పక్కింటి అబ్బాయిగా, లవర్ బాయ్‌గా సాగర్ పెర్ఫార్మెన్స్‌పై ఫిదా అవుతున్నారు. బుల్లితెర మీదే కాకుండా వెండితెర మీద కూడా విశేషంగా ఆదరణను చూరగొంటున్నారు.

Sagar RK Naidus Shaadi Mubarak 2nd day collections

గతంలో మొగలిరేకులు లాంటి సీరియల్‌తో బుల్లితెర మీద మెరిసిన సాగర్.. వెండితెర మీద కూడా తన ప్రతిభతో ఆకట్టుకోవడంపై సినీ వర్గాల్లో క్రేజ్ మొదలైంది. సీరియస్‌ పాత్రలో మెప్పించిన సాగర్.. ఇప్పుడు ప్రేమికుడిగా, సాఫ్ట్ క్యారెక్టర్‌లో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. లుక్స్ పరంగా, లవర్ బాయ్‌గా బాడీ లాంగ్వేజ్ బాగుందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. షాదీ ముబారక్ చిత్రం రిలీజ్ తర్వాత పలువురు నిర్మాతలు, దర్శకులు, అభిమానులు సాగర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నట్టు తెలిసింది.

ఇాదిలా ఉండగా, మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్న షాదీ ముబారక్ చిత్రం వారాంతంలో మంచి కలెక్షన్లను నమోదు చేసినట్టు తెలుస్తున్నది. తొలి రోజు షోల తర్వాత సాగర్ నటన, సినిమా కథ, కథనాలపై చర్చ మొదలైంది. ఈ సినిమాపై పబ్లిక్ టాక్, ప్రేక్షకుల నుంచి బజ్ క్రియేట్ కావడంతో కలెక్షన్లు కూడా పుంజుకొన్నట్టు సమాచారం. అధికారికంగా కలెక్షన్ల వివరాలు వెల్లడి కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X