twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ కలెక్షన్లతో షాక్ ఇచ్చిన మొగలిరేకులు హీరో.. మొత్తం షేర్స్ ఎంతంటే?

    |

    ఎలాంటి సపోర్ట్ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక సీరియల్స్ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఆ రూట్లోనే సాగర్ కష్టపడుతున్నాడు. ఆర్కే నాయుడు అనే పేరుతో జనాలకు బాగా దగ్గరైన సాగర్ చాలా రోజుల తరువాత షాదీ ముబారక్ అనే సినిమాతో వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

    కొంటె చూపులతో కవ్విస్తోన్న కోలీవుడ్ భామ అనన్యామణి ఫొటోలు

    13ఏళ్ళ క్రితం

    13ఏళ్ళ క్రితం

    13ఏళ్ళ క్రితం మొగలు రేకులు సీరియల్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైన నటుడు సాగర్. అందులో ఆర్కే నాయుడు అనే పాత్రలో కనిపించి మహిళల మనసులో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక గత పదేళ్ళ నుంచి సాగర్ సినిమా హీరో అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.

     దిల్ రాజు ప్రొడక్షన్ లో

    దిల్ రాజు ప్రొడక్షన్ లో

    మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఒక హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించి వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం సిద్ధార్థ - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే సినిమాలు చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమాలు అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక చాలా కాలం తరువాత షాదీ ముబారక్ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ లో గత శుక్రవారం రిలీజ్ చేశారు.

    చిన్న బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా

    చిన్న బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా

    మినీ బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు సపోర్ట్ వల్ల మంచి బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక ముందే ట్రైలర్ కాస్త పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో ఓ వర్గం ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ మాత్రం రాలేవు.

    నష్టాలు రాకుండా ఉండాలంటే..

    నష్టాలు రాకుండా ఉండాలంటే..

    సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 2.25కోట్లు. అయితే సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీసం ఒక కోటి షేర్స్ కూడా అందుకోలేకపోయింది. మొదటి రోజే 4లక్షల షేర్స్ మాత్రమే వచ్చాయి. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత కలెక్షన్స్ పెరగలేదు. ఇప్పటివరకు మొత్తంగా 15లక్షల నుంచి 16 లక్షల వరకు షేర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నష్టాలు రాకుండా ఉండాలంటే మరో రెండు కోట్ల షేర్స్ అయినా రాబట్టాలి. మరి సాగర్ ఆ రేంజ్ లో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

    English summary
    There are a lot of people who come from a character artist to a star hero without any support. There are also a lot of people who come from longer serials and try their luck in the film industry. Sagar is currently struggling on that route. Sagar, who is very close to the masses under the name RK Naidu, came up with a film called Shaadi Mubarak several days later. If you take a look at the movie box office collections ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X