ఎన్ని కష్టాలు రావాలో అన్ని కష్టాలు.. అలాంటి భయంతో బతికా.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్‌

పది నెలలపాటు లాక్‌డౌన్ చక్రబంధంలో కూరుకుపోయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఆ బంధాన్ని తెంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం రిలీజై పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...

సోలో బ్రతుకే సో బెటర్ వాయిదాతో

సోలో బ్రతుకే సో బెటర్ వాయిదాతో

సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ అనుకొన్న తర్వాత కరోనావైరస్ కారణంగా సినిమా వాయిదా పడింది. పాటల చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో మార్చి, ఎప్రిల్ రావాల్సిన సినిమా వాయిదాల మీద వాయిదా పడింది. ఆ సమయంలో సినిమా రిలీజ్ అవుతుందా అనే అయోమయంలో పడిపోయాం. అందరూ ఓటీటీలకు అలవాటు పడి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే భయం వెంటాడింది అంటూ సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు.

 ఓటీటీలో రిలీజ్ చేద్దామా అనే ఆలోచన

ఓటీటీలో రిలీజ్ చేద్దామా అనే ఆలోచన

లాక్‌డౌన్ సమయంలో సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతుంటే.. సోలో బ్రతుకే సో బెటర్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచన మొదలైంది. అలాంటి సమయంలో జీ5 నుంచి మంచి ఆఫర్ వచ్చింది. వారికి అమ్మాలా వద్దా అనే సందేహంలో ఉన్నాం. ప్రొడ్యూసర్‌కు లాభాలు రావాలని సరే అనుకొన్నాం అని సాయిధరమ్ తేజ్ తెలిపారు.

 థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని

థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని


జీ5 వాళ్లకు సినిమాను అమ్మే ముందు థియేటర్లలో రిలీజ్ చేయవచ్చని ప్రభుత్వాలు చెప్పాయి. దాంతో వారిని కన్విన్స్ చేసి సినిమా చూపించాం. వాళ్లు కూడా ఇది థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా అని కన్విన్స్ అయ్యారు. ఏ సినిమా నటుడికైనా, దర్శకుడికైనా థియేటర్‌ ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్ మాటల్లో చెప్పలేం అని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు.

సినిమా రిలీజ్‌కు ముందు అనేక సమస్యలు

సినిమా రిలీజ్‌కు ముందు అనేక సమస్యలు


ఇక సినిమా రిలీజ్ చేయడానికి ముందు చాలా రకాల సమస్యలు వచ్చాయి. థియేటర్లు ఓపెన్ చేయాలంటే కరెంట్ బిల్లులు కట్టాలి.. ఇతర సమస్యలు వెంటాడాయి. సినిమా రిలీజ్‌కు ఎన్ని కష్టాలు రావాలో అన్ని కష్టాలు వచ్చాయి. చివరకు సినిమానే గెలిచింది అని సాయిధరమ్ తేజ్ తెలిపారు.

 చిత్ర పరిశ్రమ పెద్దలు అండగా

చిత్ర పరిశ్రమ పెద్దలు అండగా

ఇక సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం రిలీజ్‌కు ముందు మాకు తెలుగు సినీ పరిశ్రమ అండగా నిలిచింది. ప్రతీ హీరో, డైరెక్టర్, నిర్మాత అందరూ ట్వీట్లు చేసి మాలో ఉత్సాహాన్ని పెంచారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ప్రయత్నించారు. వారందరికి రుణపడి ఉంటాం. సినిమా రిలీజ్ వల్ల వచ్చిన ఫలితం వల్ల అన్ని కష్టాలు మరిచిపోయాం అంటూ సాయిధరమ్ తేజ్ ఉద్వేగం ప్రసంగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X